పుట:మధుర గీతికలు.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న మాలతి


"అమ్మరో! నేఁడు పొరుగింట బొమ్మ పెండ్లి
కరిగియుంటిని, గమ్మత్తు జరగె నచట;
తోడిబాలికలును నేను నాడుచుండ,
నేలఁబడె నొక్కబాలిక కాలు జాఱి.

గొల్లు మని నవ్వి రంతట నెల్లవారు.
ఒక్కతెను నేనుమాత్రమె యూరకొంటి”
అనుచు మాలతి వచియించె జననితోడ
పలుకుపలుకున తేనియ లొలుకుచుండ.

"ఎట్టెటూ: చిట్టితల్లిరొ: యిట్లు రావె:
ఇట్టినగ లెందు నేర్చితి వింతలోనె?
ఎల్లరును నవ్వుచుండఁగ నీ వ దేల
నవ్వకుంటివో చెప్పుమా నాదుకూన!

21