పుట:మధుర గీతికలు.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చి న్న ప క్షి



పుడమిపై నేను పుట్టిన మొదటినాఁడు
ఉంటి హాయిగ నొకచిన్న యింటియందు;
విశ్వమంతయు నపుడు భావించియుంటి
గుండ్ర మగు చిన్న తెల్లనిగుల్ల యంచు.

కొన్నినాళ్లకు నొకచిన్నగూటి నుంటి
హాయిగా తల్లి ఱెక్కలయండఁ జేరి ;
విశ్వమంతయు నపుడు భావించి యుంటి
గడ్డిపోచలచేఁ గప్పఁబడ్డ దనుచు.

ఒక్క దినమున నాగూటినుండి వెడలి
అవల నే మున్నదో చూడ నరిగియుంటి;
విశ్వ మంతయు నపుడు భావించియుంటి
పసరుటాకులచేఁ గప్పఁబడిన దనుచు.

19