పుట:మధుర గీతికలు.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



దానికొన యొండు మనతోఁటలోన నున్న
చెట్లగుబురులసందున చిక్కుకొనియె;
ఒక్క గంతున చెట్టుపై కుఱికి, దాని
చిత్రముగఁ దీసికొని వత్తు చేతఁ బట్టి.

అమ్మరో! నీదు మణుల హారమ్మునందుఁ
గ్రాలు కెంపులు పచ్చలు నీలములను
అందు కుప్పలుతిప్పలై యలరుచుండె,
వాని గొనితెచ్చి నీ కిత్తు కానుకఁగను.

చిన్న ముక్కలుగా దాని చించివైచి
అమ్మ! నీచీరచెంగున కమ్మి గాఁగ,
అక్కచొక్కాయిమీదఁను నక్కి గాఁగ
కుట్టుకొనవచ్చు దానిని కొమరు మిగుల.

బాగుగా దాని నాకుచ్చుపాగఁ జేసి
చుట్టుకొనియెద శిరముపై షోకు మీఱ
గాలిపడగకు తోకగాఁ గట్టి దాని
నెగుర వైచెద గాలిలో సొగసు గులుక.

17