పుట:భీమేశ్వరపురాణము.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 27

నైర్మల్యమునఁ జేసి నడుమఁ గానఁగవచ్చు, కమిచిమ్రింగిన యంధకార మనఁగ
జన్మవేళను మంథశైలాభిఘట్టన, సంభవించిన కిణస్థాన మనఁగ
తే. విరహపరితాపవేదన వేఁగుచున్న, చక్రవాకాంగనలకటాక్షములయగ్గి
నావహిల్లినకఱదూప మనఁగనొప్పు, నుడుగణాధీశబింబంబు నడిమిమచ్చ. 45

సీ. కాలభైరవుఁడు ఢక్కాడిండిమము మ్రోయ,బహుభూతములుఁ దానుఁ బ్రహరిదిరుగఁ
జంద్రికామధు వాని చాకోరము ల్నిక్కి, దేవతాసౌధవీథికల సొగయ
నానందకాననాభ్యంతరంబులయందు, సిందువారమునఁ బూ శిథిలపడఁగఁ
గడునివాతములైన , కలుమఠంబులయందు, యతులు ప్రాణాయామ మభ్యసింప
తే. దొడ్డవయసున శీతాంశుఁ డొడ్డగిల్లెఁ, దరపి చంద్రాతపము నేల చఱచి కాయ
వంతదురపిల్లి వెన్నెల వగచివగచి, గంధవతిపట్టి యొకభంగిఁ గన్నుమోడ్చె. 46

వ. అంత. 47

సూర్యోదయవర్ణనము

చ. వెలవెలఁబాఱెఁ జంద్రుఁడును విన్నునఁ దారకచక్రవాళముల్
పలపలనయ్యె దీర్ఘికల బద్మవనంబుల షట్పదాంగనా
కలకలముల్ చెలంగె వెడకన్ను మొగిడ్చె లలిం గుముద్వతుల్
తెలతెలవాఱె జంభరిపుదిక్కునఁ దోఁచె ననూరురాగముల్. 48

సీ. ప్రథమసంధ్యాంగనాఫాలభాగంబునఁ, జెలువారు సిందూరతిలక మనఁగఁ
గైసేసి పురుహూతు గారాపుటిల్లాలు, పట్టిన రత్నదర్పణ మనంగ
నుదయాచలేంద్రంబు తుదఁ బల్లవించిన, మంజుకంకేలిని కుంజ మనఁగ
శతమన్యు శుద్ధాంతసౌధకూటముమీఁదఁ, గనుపట్టు కాంచనకలశ మనఁగఁ
తే.గాలమనియెడు సిద్ధుండు గమిచి మ్రింగి
కుతుక మొప్పఁగ నుమిసిన ఘుటిక యనఁగ
గగనమందిరదీపికాకళిక యనఁగ,
భానుఁ డుదయించె దేదీప్యమానుఁ డగుచు. 49

వ్యాసమహర్షి యాత్రకు వెడలుట

వ. ఇట్లు సూర్యోదయంబగుటయు బాదరాయణుండు కాలోచితకృత్యంబులు నిర్వర్తించి గమనోన్ముఖుండై కాశీవియోగజనితవేదనాభరంబు దుస్సహంబై యంతరంగంబుఁ గుందింప నెట్టకేలకు నేటికెదురీఁదువిధంబున శిష్యులుం దానును గనద్ఘనకనకమణిమయసౌధాట్టవిలాసంబైన యప్పట్టనంబునకుఁ బ్రదక్షిణక్రమంబునఁ జనువాఁడై లోలార్కకేశవులకు నభివాదనంబును భాగీరథికి నంజలిబం