పుట:భీమేశ్వరపురాణము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 శ్రీ భీమేశ్వరపురాణము

ధంబును విశ్వనాథునకు వినుతియు విశాలాక్షికిఁ బ్రార్థనంబును మోక్షమంటపంబునకు జయకారంబును నంతర్గేహంబున కామంత్రణంబును గాలభైరవునకు జోహారును డుంఠి వినాయకునకు శరణార్థము దండపాణికి దండప్రణామంబును గుక్కుటచతుష్టయంబునకు మ్రొక్కును సకల దేవతాకోటికి నేటికోళ్ళును జేసి చనునప్పుడు కతిపయదివప్రయాణంబున. 50

సీ. గంగానదీ ప్రవాఃకణము మాధవదేవు, దోరంతరంబు శ్రీతులసిచిగురుఁ
బురుషోత్తమమునందుఁ బుండరీకాక్షుని, దివ్యపాదాంభోజక్షేత్రజలము
శ్రీకూర్మము యందు శేషాహిపర్యంకు, కంఠంబు క్రొత్తచెంగల్వదండ
సింహాద్రియందు లక్ష్మీనృకంఠీరవ, సార్వభౌము ప్రసాదచందనంబుఁ
తే. గాశికావిప్రయోగోరుగాఢతాప, శాంతి కొదవెను శిశిశోపచార మగుచుఁ
జాయ తెరువున శ్రీబాదరాయణునకు, హరిహరధ్యానపూజపరాయణునకు. 51

పీఠికాపురవర్ణనము

సీ. ఏపట్టనముమ్రోల నేలేఱు ప్రవహించు, బృథివికి ముత్యాలపేరువోలె
మున్నూటయఱువది మూర్తిభేదములతో, విహరించు నేవీట వేల్పుపిండు
పీఠాంబచెలి యోగపీఠిహుంకృతిదుర్గ, ననిచికాపుండు నేనగరికెలనఁ
గుంతీమహాదేవి కూర్మిమేనల్లుఁడు, మానవుం డేవీట మరగినాఁడు
తే. పెద్దగవఁకుల నేపుటభేదనమున, నెలమినిలుచుండు వ్రీడావిహివజఘనుఁ
డట్టి పీఠాపురముఁ జేర నరుగుదెంచెఁ, బరమశైవుండు శ్రీపరాశరసుతుండు. 52

తే. నారికేళంపుబుట్ట నెన్నడిమిచాయ, దళములందును బోలె సంతతముఁబాఱు
వేణికాసారణులయందు విస్మయము , జగతి నెక్కడి వేలేటి సాటినదులు. 53

సీ. ఏఁటేఁట విరినీట నిరుగారునుం బండు, బ్రాసంగువరిచేలఁ బసిఁడిచాయఁ
బరిపాకమున వేగుపనసపండుల తావి, యిందిందిరములకు విందు సేయు
వేఁబోఁకఁబొలుపారు వింధ్యాద్రి పవనంబు, సోఁకపువ్వులతావిఁ బుక్కిలించు
వేశ్యవాటికలందు విహరించు వలరాజు, ననయంబుఁ జెఱకువిల్లును ధరించు
తే. నారదంబుల వలపుపొన్నలఁ బెనంగి, విచికిలామోచములతోడ వియ్యమందుఁ
బాటలీపుష్పకేతకీపరిమళములు, పొదల విలసిల్లుఁ బీఠికాపురమునందు. 64

వ. వెండియు ననఖండమండలంబగు మహీమండలంబునకు మకరకుండలాలంకారంబునుం బోలె భీమేశ్వరమండలంబు పొరువునఁ ద్రిలింగోత్కలతలంబులనంది వింధ్యాచలపాదంబునఁ గేదారకుంభకోణార్కస్థానంబుల కుపమానంబనఁజాలి యేలేటిమేటికాలువలవలన నదీమాతృకంబులగు పంటవలంతి సలిలధౌతకలధౌత