పుట:భాస్కరరామాయణము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శ్రీహితనయవిలసనవా, ణీహితమృదువచన ధారుణీహితగుణసం
దోహ యసహాయవిక్రమ, సాహసనవసాహసాంక సాహిణిమారా!

1. ఆ.


క.

శ్రీరామాకుచయుగళీ, హారిద్రోల్లసితవక్ష, హరిచరణసరో
జారాధ్యుఁడు మారయధర, ణీరమణోత్తముఁడు సాహిణీతిలక మిలన్.

2.ఆ.

అనియు యుద్ధకాండమున

క.

శ్రీకరకరుణారుచిరవి, లోకనలీలావికాసలోల విపశ్చి
ల్లోకవివేకకలాశి, క్షాకుశలా మేరుధీర సాహిణిమారా.

యనియు నున్నది. ఈరెండు నేకకృతిపతినే గుఱించుటంబట్టి యీ రెండుకాండములకర్తృత్వము నొకభాస్కరునికే చెల్లుచున్నది. భాస్కరుఁ డొకఁడే యనుటకు నింతకంటె బలీయ మైనప్రమాణ మేమి కావలయును? మఱి యీ యొకభాస్కరుఁడు మంత్రిభాస్కరుడా? హళక్కి భాస్కరుఁడా? యనువిషయమున నయ్యలార్యుని 'అమర హళక్కి భాస్కర' యనుపద్యము హళక్కి భాస్కరుఁడే యని సిద్ధాంతము సేయుచున్నది. అయ్యలార్యుఁడు 'అమర హళక్కి భాస్కరమహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాండముతరువాయి' అని యుద్ధకాండమును హళక్కి భాస్కరుఁడు చేసినట్టు చెప్పెను గాని యరణ్యకాండమునుగూడఁ జేసినట్టు చెప్పలేదే యన్నచో నిది సరిగాదు. భాస్కరుఁడు యుద్ధకాండమును రచింపఁగా మిగిలినభాగమును దాను బూరించిన ట్లయ్యలార్యుండు చెప్పినాఁడేకాని భాస్కరుఁడు యుద్ధకాండమును మాత్రమే రచించెనని చెప్పలేదు. తనపూరణమునకుఁ బాలుపడిన దతనియుద్ధకాండమే కానీ పూరించుటకై దానిం జెప్పవలసి చెప్పినాఁ డింతేకాని తక్కినకాండములు చెప్పనవసరము లేదు. కనుకఁ దక్కినవానిని జెప్పనంతమాత్రకు భాస్కరుఁడు వానిని రచింప లేదనుట సిద్ధింపదు. ఇట్లు గ్రంథస్థనిదర్శనము లగు నాద్యంతపద్యగద్యములం బట్టియు నయ్యలార్యునిపద్యము బట్టియు నారణ్యకాండయుద్ధ కాండములు హళక్కి భాస్కరుఁడు రచించె ననుటయే యుక్తముగా నున్నది. ఇఁకఁ

2. చరిత్రాద్యాధారము

గృతిపతి యగుసాహిణిమారుని కాలముంబట్టియు మంత్రిభాస్కరాదులకాలములంబట్టియు నీవిషయము పరామర్శింతము. సాహిణిమారుఁడు ఓరుగంటి రెండవ ప్రతాపరుద్రునియాస్థానమం దున్నట్లు సోమదేవరాజీయము దెల్పుచున్నది. అందుఁ బ్రతాపరుద్రునిసభలో 'హళక్కి భాస్కరుఁడు మొదలుగాఁ గల ప్రబంధకవీశ్వరు లిన్నూఱుగురును...... అశ్వంబుల కధికారి యైన సాహిణీమారనయు నున్నట్లు చెప్పఁబడియున్నది. ఈప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1295 వ సంవత్సరము మొదలుకొని 1321 వఱకు రాజ్యము చేసెను. ఇతని కాలమందు సాహిణిమారనయు హళక్కి భా