పుట:భాస్కరరామాయణము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

వీ తెంచుచున్న వివి యెందులఘనధ్వను లన నమ్ముని యక్కుమారులతో నిట్లనియె.

226


చ.

చను రజతాద్రిమీఁద నొకచారుసరోవర మజ్జగర్భుచే
మనమున నిర్మితం బగుట మానసనామము నొంది రూఢిగా
ననువుగఁ దత్సరఃప్రసృతయై సరయూనది యయ్యయోధ్యచు
ట్టును బ్రసరించి జాహ్నవి గడున్ వడిఁ గూడఁగ నేఁగుదెంచినన్.

227


క.

గంగాసరయూసంగమ, భంగము లొండొంటిఁ దాఁకి ప్రభవించినయు
త్తుఁగధ్వను లివి యని ముని, పుంగవుఁ డెఱుఁగంగఁ జెప్పి భూవరసుతులన్.

228


క.

కనుఁగొని మ్రొక్కుఁడు వినయం, బున ననవుడు భక్తితోడ మ్రొక్కుచు నావా
హిని దాఁటి దక్షిణతట,మ్మున నిల్చి రఘూద్వహుండు మునిపతితోడన్.

229


సీ

కకుభాశ్వకర్ణతిందుకబిల్వఖదిరమ, ధూకపాటలసాలదుర్గమంబు
కంకఝిల్లీబకక్రౌంచఘూకానేక, కాకులస్వనకలకలంబు
సూకరహర్యక్షశుండాలశార్దూల, శరభాదిమృగకులసంకులంబు
నాయతబహుతరచ్ఛాయానిరస్తస, మస్తతీవ్రాంశుగభస్తిచయము
నంధకారీకృతాశాంతరాంతరంబు, దుర్నిరీక్ష్యంబు జనలోక[1]దురవగాహ
మఖిలవనమృగగణశరణ్యంబు [2]నీయ, రణ్య మారయ నెవరియరణ్య మనిన.

230


వ.

మునిపతి రఘుపతితో నిట్లనియె.

231


సీ.

అమరనాయకుఁడు వృత్రాసురు వధియించి, యధికపాపబ్రహ్మహత్యఁ బొంద
సురలు మునీంద్రులు సరభసనంబున వచ్చి, సుత్రాముగాత్రంబు శుద్ధిఁ బొందఁ
గమనీయపావనకలశోదకంబులఁ, గడుగుచు నెమ్మేనఁ గలయ నున్న
మలకరూశంబులు లలిఁ బుచ్చి యిలమీఁద, వైవంగ నప్పుడు వాసవుండు
విపులనిర్మలతరదేహవినుతశుద్ధిఁ, బొంది యెంతయు విలసిల్లి భూమి నాదు
మలకరూశంబు లివి రెండు మహిమతోడఁ, బూనెఁ గావున నింక నీభూమియందు.

232


క.

మలకలిత మైన దేశము, మలదంబుఁ గరూశయుక్త మహి గలదేశం
బలవడఁ గరూశనామము, నిలఁ గా ని మ్మనుచు సంజ్ఞ లింద్రుఁడు సేసెన్.

233


వ.

అది యాదిగా మలదకరూశదేశంబులు రెండును ధనధాన్యసంపన్నంబులై చె
న్నొందుచుండఁ గొంతకాలంబునకు.

234


క.

తాటక యనియెడునొక్కని, శాటి సహస్రగజబలసమన్విత యయి యు
గ్రాటవిఁ జరించు సుందుని,జోటి యది తదీయసుతుఁడు శూరుం డెపుడున్.

235


క.

అలఘుఁడు మారీచుం డా, మలదకరూశములు రెండు మానక నాశం
బులు సేయుచుండుఁ దాటక, చలమున మార్గములు గట్టి జనులం జంపున్.

236


వ.

అప్పాపాత్ములనిమిత్తంబున నిప్పురంబులు నిర్జనంబు లై యుండుట మార్గం బిట్లు
దుర్గమారణ్యం బై యుండు నిచటికి నర్థయోజనమాత్రంబునం దాటక యు

  1. దుర్గమంబు నఖిలజనహింసమృగశరణ్యంబు
  2. నీదురాక్రమారణ్య మెవరియరణ్య మనిన