పుట:భాస్కరరామాయణము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వామిత్రుండు దశరథుం కానవచ్చుట

మ.

ధరణీశుం గన గాధిపుత్రుఁడు సముద్యత్పుణ్యగాత్రుండు భా
సురచారిత్రుఁడు సర్వసంయమిజనస్తోత్రైకపాత్రుండు సు
స్థిరసంపూర్ణతపఃపవిత్రుఁ డురుసందీప్తప్రభామిత్రుఁ డ
ధ్వరసంపూజితవీతిహోత్రుఁ డగువిశ్వామిత్రుఁ డేతెంచినన్.

165


క.

కని దౌవారికుఁ డురవడిఁ, జని విశ్వామిత్రుఁ డిటకుఁ జనుదెంచినవాఁ
డనుడుఁ బురోహితయుతుఁ డై, జననాథుఁడు వాసవుండు చతురాస్యునకున్.

166


క.

ఎదు రేఁగినగతి నమ్ముని, కెదురుగఁ జని మ్రొక్కి యర్ఘ్య మిచ్చి ప్రమోదం
బొదవఁగ నుండం గనుఁగొని, హృదయం బలరఁగ మునీంద్రుఁ డి ట్లని పలికెన్.

167


క.

దశరథ నీకుం బ్రజలకుఁ, గుశలమె సుతబంధురాష్ట్రకోశంబులకుం
గుశలమె వసిష్ఠ నీకుం, గుశలమె మునులార మీకుఁ గుశలమె యనినన్.

168


క.

అందఱుఁ గుశలము లన న, య్యందఱఁ దోడుకొని వచ్చి యర్హాసను లై
యందఱు గృహమున నుండఁగ, నందఱఁ బూజించె నృపతి యనురాగమునన్.

169


వ.

అప్పుడు దీప్తాగ్నియుంబోలెఁ దేజరిల్లెడు విశ్వామిత్రు నవలోకించి.

170


సీ.

అమృతంబు సంప్రాప్త మైనచందంబున, మరుభూమి నురువృష్టి గురిసినట్లు
[1]నిఱుపేద కర్థంబు నెఱయఁ గల్గిన భంగి, నంబురాశికిఁ బర్వ మైనకరణి
ననురూపసాధ్వియం దనపత్యునకుఁ బుత్ర, జనన మబ్బినమాడ్కి మునివరేణ్య
నీశుభాగమనంబు నేఁడు నా కిటఁ గల్గెఁ, గాన ధన్యుఁడ నైతిని గంటిఁ గీర్తి
యెల్లపుణ్యభోగములు నా కెదురువచ్చె, శుభచరిత్రుండ వతితపశ్శుద్ధమతివి
పరమపాత్రుఁడ వగునీకు భక్తితోడ, నేమి యడిగిన నిచ్చెద నెలమి వేఁడు.

171


క.

అనవుడు వసిష్ఠశిష్యుఁడ, వనఘుఁడ వతిసత్యధనుఁడ వర్కాన్వయసం
జనితుఁడవుఁ గాన యిటకుం జనుదెంచితి నాదుకోర్కి సమకూర్పు తగన్.

172


చ.

ఇరువురు రక్కసుల్ సవన మెప్పుడు నే దొరఁకొంటి నంతలోఁ
బరిగొని వచ్చి వేదికలపై రుధిరంబులు సల్లి మాంసము
ల్నెరపుచు యజ్ఞవిఘ్న మవలీల నొనర్తురు సారెసారెకుం
గెరలి శపింప వారిఁ బరికించి తపోవ్యయ మోర్వలేమిచేన్.

173


[2]దశరాత్రసవనమునకుం గుశలత సేయంగ వలయుఁ గుటిలనిశాటుల్
భృశగతిఁ జెఱుపక యుండను, దశరథ నీసుతుఁడు వారి దక్షతఁ దునుమన్.

174


క.

కావున నప్పాపాత్ముల, వేవేగ వధించి లోకవినతులు పొందన్
నీవరపుత్రుని రాముని, భూవర ప్రియమార నాకుఁ క బుత్తెమ్ము తగన్.

175


ఉ.

బాలుఁ డశక్తుఁ డీతఁ డనుభావము మాను మితండు సర్వది
క్పాలకపాలనక్షమనృపాలుఁడు [3]నానతవిద్విషత్క్షమా

  1. 'నిఱుఁబేద' వ్రా. ప్ర,
  2. దశరాత్రము సవనమునకుఁ
  3. దారితదేవవిద్విషత్పాలుఁడు వ్రా.ప్ర.