| | పన్నుని నన్ను నోర్తు నని బాణములున్ విలుఁ గేలఁ బూని మీ | 1030 |
| శా. | ప్రాణంబుల్ వలతేని రాముదెస సౌభ్రాత్రంబు వోఁబెట్టి నీ | 1031 |
| శా. | కేలం బుంఖమణిప్రభన్ మెఱయఁగాఁ గీలోద్గమాభీలలీ | 1032 |
| వ. | అనిన విని సక్రోధంబుగా నవ్వి యవ్వీరుం డి ట్లనియె. | 1033 |
| క. | అధముఁడు దనుఁ దాఁ బొగడిన, నధికుఁడు గాఁ డల్పుభంగి నాత్మశ్లాఘా | 1034 |
| ఆ. | విల్లు గేల నుండ వీటిఁ బోయినవట్టి, మాటలందుఁ గలదె మగతనంబు | 1035 |
| క. | ఇదె విలునమ్ములుఁ గొని నీ, యెదురను నిలుచున్నవాఁడ నేవిద్యాసం | 1036 |
| ఉ. | వంచన నన్యకాంతఁ గొని వచ్చినతుచ్ఛుని మీదశాననుం | 1037 |
| ఆ. | పక్వతాళఫలముభంగి నీతల గూల్పఁ, బిన్నతనము నీదుపెద్దతనము | 1038 |
| వ. | అని పలుకుసమయంబున. | 1039 |
| ఉ. | కాంచనపుంఖ మై వెలుఁగుకాండము మంటలు వాఱ వింట సం | 1040 |
| ఆ. | రక్కసుండు నిటలరక్తచ్ఛటోద్గమ, మద్భుతావకాశ మగుచు మెఱయ | 1041 |
| వ. | ఇట్లు విక్రమించిన దశకంఠనందనుండు దశస్యందననందనుం గనుంగొని. | 1042 |
| క. | విలుకాఁడ వౌదు నన్నుం, జలియింపఁగఁ జేసి తిట్లు శస్త్రప్రౌఢిం | |