పుట:భాస్కరరామాయణము.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

[1]అ ట్లగ్గజంబులం జంపిన భరద్వాజుండు సంతసిల్లి మునులకడ కేతెంచి మజ్జనకుం
జూపి యీకపిరాజు మనధర్మవిరోధు లైనకుంజరంబుల వధియించెఁ గుంజరసూద
నుండు గావునం గేసరి నాఁ బరఁగు నీతఁ డితనికిం బ్రియం బైనవరం బిం డనిన
నమ్మును లతనిం గనుంగొని.

811


క.

దురమున భీకరముగ నా, కరులం జంపితివి గాన గరము ప్రియం బే
వర మిట నడుగుము నావుడుఁ, బరమప్రియ మంది నాకుఁ బ్రమదం బెసఁగన్.

812


క.

అనిలబలసముఁడు నవ్యయ, తనుఁడును గామగముఁ డిద్ధతరజవసత్త్వుం
డును గామరూపియును నగు, తనయుఁడు గలుగ వర మిండు తాపసవర్యుల్.

813


వ.

అనిన నమ్మును లట్ల వరం బిచ్చి రంత నొక్కనాఁడు.

814


క.

కుంజరుఁ డనియెడువానర, కుంజరునితనూజ చారుగుణరూప మనో
రంజన పుణ్య యనం జను, నంజన మాతల్లి లీల యౌవనవేళన్.

815


చ.

జలధిజలాభిషేచనము జానుగఁ జేసి జలార్ద్రకేశి యై
మలయగిరీంద్రశృంగమున మానస మింపఁ జరింప నంజనా
లలితశరీరయౌవనవిలాసము లారఁగఁ [2]గౌఁగిలించి య
త్యలఘుతరానురాగమున నాసతిఁ జూచి సమీరుఁ డిట్లనున్.

816


వ.

అంగన నే నఖిలప్రాణులకుఁ బ్రాణుండ నైనజగత్ప్రాణుండ సంగజశరచ్ఛిన్నమాన
సుండ నై భవదీయాలింగనంబునుం జేసితి మదీయాంగసంగదోషంబు నీకు
లేదు నావలన నీకు వానరరూపుండును మహాజవుండును నధికుండును సౌమ్యుం
డును నగ్నితేజుండును మదీయసమవేగబలశాలియు నగుపుత్రుండు పుట్టెడు నని
పలికె న ట్లయ్యంజనాదేవికి జనియించితిఁ గేసరికి క్షేత్రజుండ ననిలున కౌరసపు
త్రుండను గావునఁ బవనగమనవేగంబున నాకు సమానుం డెందును లేఁ డని
పలికి వీరరసావేశంబున.

817


సీ.

అస్మద్భుజోరువాతాతివేగమున నం, భోనిధిగ్రాహముల్ మూర్ఛఁ బొంద
విఱిగి పాదపశైలవిపులశృంగమ్ములు, నెగసి యాకస మెల్లఁ బగుల నడువ
వడిఁ గులాచలములు వడవడ వడఁకంగ, జగతీతలం బెల్ల సంచలింపఁ
దోయదమాలికల్ దూలి నల్గడఁ బాఱ, సకలదిక్కులు మ్రోయ జగము బెగడ
వీఁక జలరాశి యవలీల వేగ దాఁటి, లంక నిశ్శంకతోఁ జొచ్చి లలితపుణ్య
సీతఁ బొడగాంచి కృతకార్యసిద్ధితోడ, నరుగుదెంచెద ముద మొందుఁ డఖిలకపులు.

818


చ.

వనధిఁ గలంచెదం బుడమి వ్రక్కలు సేసెద నింగి మ్రింగెదన్
ఘనతరశైలముల్ వెఱికి క్రన్నన నూడ్చెదఁ గాలమృత్యువున్

  1. వ. అ ట్లగ్గజంబుఁ జంపిన.......ధర్మవిరోధి యైనకుంజరంబు వధియించె......
    క. దురమున నక్కరిఁ జంపితి గాన నీకుఁ కరము
    అని పాఠ మున్నది.
  2. జూచి మానసం, బలరఁగఁ గౌఁగిలించికొని యాసతిఁ