పుట:భాస్కరరామాయణము.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విద్ధబలుఁడవు ఖగకులాకధీశుకంటె, నధికజవసత్త్వయుక్తుఁడ వరయఁ జిత్ర
మైననీవిక్రమముఁ జూడ నాసతోడ, నెదురుచూచుచు నున్నవా రెల్లకపులు.

804


క.

క్షోణిజఁ గని వచ్చి జగ, త్ప్రాణజ రఘువంశవరులప్రాణంబులు మా
ప్రాణంబులు సుగ్రీవుని, ప్రాణములుం గావు నీవ ప్రాణము మాకున్.

805


ఉ.

కావున నీవు రామహితకార్యము సేయఁగ నబ్ధి దాఁటి యా
రావణులంకఁ జొచ్చి మఱి రాఘవువల్లభఁ జూచి రమ్ము సు
గ్రీవుఁడు సంతసింప మము క్షేమముతోఁ గొనిపొమ్ము లోకసం
భావితకీర్తిఁ బొందు మిఁక బంధురధర్మముఁ బొందు పావనీ.

806


వ.

అని పలుకునప్పుడు.

807


మ.

గిరిరుద్ధాంఘ్రులు మింటితో నొఱయ [1]వాక్షేపించులాంగూలముం
దరుణాదిత్యవిధూమసావకసముద్దామాననంబుం గరం
బరు దారంగఁ ద్రివిక్రమక్రమసముద్యన్మూర్తి యై దృప్తకే
సరివిస్రంభవిజృంభణం బెసఁగఁ గీశశ్రేణి యగ్గింపఁగన్.

808

హనుమంతుఁడు నిజజననవృత్తాంతంబు వానరులతోఁ జెప్పుట

వ.

పున్నమఁ గడలొత్తి యుప్పొంగుసముద్రంబునుంబోలె మేను వొంగ బలోత్సా
హంబు లంతకంత కెసఁగ హనుమంతుండు వనచరులతో నిట్లనియె మజ్జననీజన
కులవృత్తాంతంబును మజ్జన్మక్రమంబును వినుండు పశ్చిమసముద్రంబుచెంత ముని
జనసేవ్యం బైనప్రభాసం బనుపుణ్యతీర్థంబు గల దెప్పుడు మును లాతీర్థంబున
నవగాహనంబు సేయం జొత్తు రప్పుడు [2]శంఖశబలనామంబులు గలదుష్టగజం
బులు రెండు కోపాటోపంబున దుష్టమానసంబు లగుచు నాఋషులం బొడగని
పడం బొడుచుచు నుండు నవి యొక్కనాఁడు మునిపూజితం బైనపుణ్యవనం
బుఁ జొచ్చి యచ్చట నున్న భరద్వాజుపైఁ గవియ నచటఁ బర్వతకూటంబున
నున్న మజ్జనకుం డక్కుంజరంబుల బొడగని రోషావేశంబున.

809

,

చ.

బలువిడి నార్చుచున్ గజముపై గజముం బడవైచి పెన్నఖం
బుల వడి వానినేత్రములు భూరిరయంబున వ్రచ్చి యంతలో
నిలకు రయంబునన్ డిగి యహీనబలంబున నొక్కసాలమున్
లలిఁ బెకలించి పట్టి కడులావున వ్రేసి వధించె నొక్కటన్.

810
  1. నుత్క్షేపించు
  2. ఇట హనుమంతుఁ డొక్కగజమునే చంపినట్లు వ్రాఁతప్రతులఁ గానఁబడుచున్నది. కాన
    శంఖశబలనామకం బగుదుష్టగజంబు.......దుష్టమానసం బగుచు నాఋషులం........నది యొక్కనాఁడు మునిపూజితం........డక్కుంజరంబుఁ బొడగని ....
    చ. బలువిడి ..... గజముపైఁ గవియం బటుతీవ్రతన్ నఖం
    బుల వడి దానినేత్రములు భూరి......లావున వ్రేసి వధించె నక్కరిన్.