పుట:భాస్కరరామాయణము.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఇమ్మెయి బాహువుల్ దునిసి యే పఱి రక్తజలంబు పై పయిం
గ్రమ్మఁగఁ గూలె రోఁజుచును మ్రాఁకులునుం బొదలుం బ్రపాతవే
గమ్మునఁ జాపకట్టువడఁగాఁ గులిశక్షతపక్షశైలరూ
ప మ్మనఁగా వసుంధరఁ గబంధుకబంధము ఘోరభంగిగన్.

390


వ.

[1]ఇట్లు కూలి దైత్యుం డొక్కింతవడికిఁ దెలివొంది మీ రెవ్వ రలఘుశౌర్యు
లార యన సుమిత్రాసుతుం డి ట్లని చెప్పె.

391


క.

కాకుత్స్థరాముఁ డీతఁడు, నా కగ్రజుఁ డేను లక్ష్మణాఖ్యాకుఁడ మున్
భూకాంతునిసతి జనశూ, న్యైకాటవి రాక్షసాపహృత యై పోవన్.

392


ఉ.

ఆరమణీలలామ నిట నారయ వచ్చితి మీవు నిచ్చటం
బేరుర మాస్య మై వికృతకభీషణభంగి వెలుంగ భగ్నజం
ఘోరుముఖుండ వై వికృతి నొంది కబంధమువోలెఁ గుత్సితా
కారత నున్నవాఁడ వధికప్రభ నెవ్వఁడ వీవు సెప్పుమా.

393


చ.

అనవుడు నాతఁ డాత్మ ముద మందుచు రాఘవులార మిమ్ము న
త్యనఘులఁ గంటి భాగ్యమున ధన్యుడ నైతి మదీయశాపముం
జనియెడు మీప్రసాదమున సమ్మతిఁ జూడుఁడు హేయ మైనయి
చ్చెనఁటిశరీరమున్ విడిచి చెన్నగుమూర్తి వరింతు నాకమున్.

394


వ.

అస్మద్విధంబు చెప్పెద వినుండు.

395


సీ.

దను వనియెడునామjమునఁ బ్రవర్తిల్లుదుఁ, గాంతిఁ జంద్రునిఁ బ్రభాకరునిఁ దేజ
మునయందుఁ బాకశాసను భోగమునఁ బోలు, నితఁ డనుకీర్తి వహింతు నజునిఁ
[2]దపమున మెప్పించి ధరఁ జిరజీవిత, త్వము కామరూపంబు వరము గాంచి
క్రౌర్యపరుండ నై కడఁగి హింసారతి, నెలమితోడుత మించి యెపుడు సమద
లీలఁ దిరుగుచు నుండుదు స్థూలశిరుఁ డ, నంగ నొక్కఁడు దపము సేయంగ నచటి
కిట్టివికృతాకృతిని దాల్చి యేఁగి యతని, యెదురఁ దిరుగ నాసంయమి యెఱిఁగి యలిగి.

396


క.

ఈరూపము కడుఁ బ్రియపడి, గారవమునఁ దాల్చి వేడ్కఁ గ్రాలెద విదె నీ

  1. తే. ఇట్లు కూలినదైత్యుఁ డొక్కింతవడికిఁ, దెలివి నొంది మీ రెవ్వ రత్యలఘుశౌర్యు
         లార యనఁ దమకథల నల్లనను దెలియ, నంతయును జెప్పి నాసుమిత్రాత్మజుండు.
    క. విని రామలక్ష్మణులఁ గని, జనవంద్యులు మీరు మీప్రసాదంబున మ
         ద్ఘనదుఃఖ మెల్లఁ బాసెను, వినుఁ డస్మద్విధముఁ దెలియ వినిపింతుఁ దగన్.
  2. తపమున మెప్పించి తత్కృపఁ జిరజీవి, కతయును బీరంబుఁ గామరూప
    కత్వము నేఁ గాంచి క్రౌర్యపరుండ నై, హింస కాస్పదుఁడ నై యెపుడు సమద
    లీలఁ దిరుగుచు నొక్కచో స్థూలశిరుఁ డ, నంగ నొకముని తపము సేయంగ నచటి