పుట:భాస్కరరామాయణము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిణిమారునిసంబోధన మున్నది. ఇందులకుఁ దుదనో కేవలశివసంబోధనమే కానిపించుచున్నది. వీని నెల్లంబట్టి చూడఁగా నితఁడు రచించిన మూడుకాండములతుదలందును దప్పక శివసంబోధనము లుండుటచే నివి యితఁడు రచించినవియే యగు ననియు, వానితొలుత నొక్కట బొత్తిగా లేకయు నొక్కట సందిగ్ధముగాను మరొక్కట మాత్రము గలిగియు నున్న మారనసంబోధనము నిటీవల నెవరో తక్కినకాండములం జూచి కల్పించి చేర్చి రనియుఁ దోఁచుచున్నది. కావుననే కిష్కింధాకాండము తుదమాత్ర మున్న 'లాటీచందన' యనుమారన సంబోధనమును గల్పితమే కావలయును, అట్లు కానిచో నట్టిది తక్కినకాండములతుదలందును శివసంబోధనముతోఁగూడ నేల చెప్పఁబడకున్నది? ఆ పద్యమును వ్రాతప్రతులం బెక్కింట చూపట్టకుండుటయు నది కవిరచితము గాదనుట కొకనిదర్శనముగా నున్నది. మఱియు సుందరకాండముతొలుత నున్న మారనసంబోధనము శివభక్తుఁ డగుమల్లికార్జునుఁడే రచించినదేని యతఁడు సాహిణిమారుని శివభక్తునిఁగా సంబోధించియుండునుగాని విష్ణుభక్తునిఁగా సంబోధింపఁడు. అందు విష్ణుభక్తుఁడుగానే యతఁడు సంబోధింపఁబడుటయు 'హరిచరణసరోజారాధ్యుఁ' డని యారణ్యకాండమం దుండుటను జూచి య ట్లితరులచేఁ గావింపఁబడె నని యూహింప నగుచున్నది. మల్లికార్జునుఁడే యారణ్యకాండమందలి యాసంబోధనమును జూచి యట్లే సుందరకాండమందును సంబోధనమును నిబంధించి యుండవచ్చు నన్నచోఁ దనతక్కినకాండములతొలుత సాహిణిమారనసంబోధనమును మానుటకే తెగించిన యతఁడు సుందరకాండమున విష్ణుభక్తునిని శివభక్తునిఁగా మార్చుట మాత్రమునకుఁ జాలఁడా? ఇట్లు భాస్కరుని దయినయీరామాయణమునందుఁ జాలభాగము రచించియుండుటఁబట్టియు, గద్యమున భాస్కరునిపుత్రుఁ డని చెప్పికొనియుండుటఁ బట్టియు, మల్లికార్జునుఁడు భాస్కరునిపుత్రుఁ డయినం గావచ్చును గానీ సాహిణిమారునిసంబోధనము లేనందున నతఁడు దీనిని సాహిణికాలమున రచించె ననుట సందిగ్ధముగా నున్నది. అయోధ్యాకాండమును రచించిన కుమారరుద్రదేవుఁడు కాండముతొలుతను దుదను సాహిణిమారునే సంబోధించి యున్నాఁడు. మఱి యితఁడు 'బుద్ధయకుమార సాహిణిమారా' 'కాచమాంబాకుమారా' యనుటచే సాహిణిమారుఁడు బుద్ధయకును గాచమాంబకును బుత్రుఁ డని తెలియుచున్నది. గద్యమున 'మారయకుమార కుమారరుద్రదేవ' అనుటచే నితని నా సాహిణిమారునికుమారుఁ డందురు. దీనింబట్టి బుద్ధరాజుకుమారుఁడు సాహిణిమారుఁ డతనికుమారుఁడు కుమారరుద్రదేవుఁ డని చెప్పఁబడుచున్నది. ఈ కుమారరుద్రదేవుఁ డయోధ్యాకాండమును రచించుటకు భాస్కరునిశిష్యుఁ డగుట కారణ మని కొందఱును, దాని నెవ్వరును రచింపకుండఁగాఁ దానే రచించె నని కొందఱును, జెప్పెదరు. ఇం దేది నిజమో తెలియరాదు. సాహిణిమా