పుట:భాస్కరరామాయణము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మునివ్రేళ్లు నేల మోపుచు, వెనుకదెసం జప్డు గాక వెరవునఁ గదియం
దనుఁ జూచియు ఱెప్పలకడ, లును లే కటు నిలుచు నిలిచి లోఁబడుకొలఁదిన్.

48


క.

పిఱిఁదికిఁ బో నిచ్చిన వి, ల్లఱితికి నై యల్లఁ జూఁప నది గనుఁగొని పె
ల్లుఱికి చను లతలు పులువడఁ, జిఱుముం గడు నాస పుట్ట శృంగాగ్రములన్.

49


వ.

ఇవ్విధంబునం బెక్కుదూరం బరిగి యెండమావు లుదకంబు లని తలంచుచుఁ
దృష్ణాతిరేకంబునం దగులుమృగపతియునుంబోలె నారామచంద్రుండు.

50


సీ.

పొదదండగాఁ జేరి యుదరిపాటునఁ బట్టఁ, బొంచెద నంచును బొంచిపొంచి
మొక్కలంబున నున్న ముట్టి పర్వున డయ్యఁ, బాఱి పట్టెద నని పాఱిపాఱి
దొడ్డికట్టై యున్న తోరంపుటీరంబుఁ, జొరఁ జోపి వెనువెంటఁ దిరిగి తిరిగి
పొరకలు మెయినిండఁ బూరించుకొని పచ్చ, చెట్టుచందంబునఁ జేరిచేరి
మడుఁగులకు నల్ల దార్చుచు నడుసు గలుగు, [1]కొలఁదిఁ బట్టంగ నగు నని వెలిచి వెలిచి
యలమృగమువెంట నొయ్య నాసాసఁ దిరిగె, నామృగవ్యాధరుద్రుఁడో యనఁగ విభుఁడు.

51


వ.

[2]మఱియు నందంద తఱుముచుం బ్రిదిలి పోవుచు
తఱుముచుఁ బ్రెదిలి పోవుచు నిత్తెఱంగునం దార్చు సమ
యంబున.

52


సీ.

నీరాక యెఱుఁగుదు నిక్కంబు ననుమాడ్కి, నోరచూపునఁ జేరి యొయ్య గిఱువుఁ
జందురునిఱ్ఱితో సమరంబునకు నేఁగు, పగిదిఁ గుప్పించి యుప్పర మెగయును
సురిఁగిపోయెద నన్నఁ జొరఁ జోటు లే దింక, నీవె ది క్కనుభంగి నెదురువచ్చుఁ
దనయకోర్కికి నుర్వి తనుఁ బట్టు ననుగతి, నవనిపై నిలువ కందంద దాఁటు
మరలిచూచుఁ దిరుగు మఱియు నల్దెసఁ బాఱు, నలసినట్ల నిలుచు నల్ల బెదరు
మెలఁగి దెసలు వెదకు మెడ యెత్తి గాలిది, క్కరయు నక్కురంగ మచటనచట.

53
  1. పొలఁతిపట్టుగ నని వెల్చి నిలిచినిలిచి
    యామృగము నేయకయె పట్టు నాసఁ దిరిగె,
  2. 52 మొదలుగా 60 వఱకుఁ గలవ్రాఁతప్రతుల పాఠము,
    క. తిరిగి తిరిగి కడుఁదడవున, కరయఁగ నిది దనుజమాయ యగు నని కోపో
         ద్ధరుఁడై యమోఘశరమున, ధరణీశ్వరుఁ డేసె శీఘ్రదారుణభంగిన్.
    చ. అది మును మాయ మ్రింగి దనుజాంగము సొచ్చి పగుల్ప వాఁడు బె
         ట్టిదుఁ డయి మీఁదికిన్ నెగసి డెప్పర మై యిలఁ గూలి వ్రాలెఁ బె
         ల్లదరుచు లక్ష్మణా యనుచు హా యని రామునెలుంగుభంగి యై
         యద్రువఁగ నన్నిదిక్కులు మహాధ్వని సీత గలంగునట్లుగన్.
    క. అని ఘోరంబుగ నఱచుచు, దనుజుఁడు పుడమి నిజరూపధరుఁ డై పడియెం
          బెనుమేనితోన రాముఁడు, గమఁగొని విభ్రాంతి సాలఁ గదిరెడుమదితోన్.