పుట:భాస్కరరామాయణము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

భాస్కరరామాయణము

అయోధ్యాకాండము



రమణీరమణసుధా
ధారాళదయాకటాక్షధామస్మితదృ
క్కైరవవితరణకరణవి
శారద బుద్ధయకుమార సాహిణిమారా.

1


వ.

అవధరింపుము.

2


[1]క.

ఉల్లమున మనోరథములు, మల్లడిగొన నవ్విభుండు మధురస్ఫుటవా
గ్వల్లిక సఫలతకై సభ, కెల్లం జిత్త మిగురొత్త ని ట్లని పలికెన్.

3

దశరథుండు శ్రీరామునకుఁ బట్టాభిషేకం బొనర్ప నిశ్చయించుట

. 6

క.

మిక్కిలి భోగము లందితి, నెక్కుడు సంపదలు గంటి నెల్లగుణములం
జక్కనికొడుకులఁ బడసితి, నిక్కుంభినిఁ బెద్దగాల మేలితి నింకన్.

4


రాజ్యభరం బఖలగుణ, ప్రాజ్యుం డగు రామునందు ప్రాపించెద సా
మ్రాజ్యపదంబున కెంతయుఁ, బూజ్యుం డతిచతురుఁ డతఁడు పుత్రులలోనన్.

5


శా.

ధీరోదారుఁడు నిర్వికారుఁడు జగద్వీరుండు సౌజన్యవి
స్తారుం డుత్తమశీలుఁ డర్కకులనిస్తారుండు శూరుండు గం
భీరుం డిద్ధవిచారసారుఁ డగుటం బెంపార విశ్వంభరా
భారం బెల్ల భరింప రాఘవు మహాభాగున్ నియోగించెదన్.

6


వ.

అని పలికి వసిష్ఠవామదేవాదిపురోహితులును సుమంత్రాదిమంత్రులును సమస్త
బంధురాజలోకంబును ననుమతి సేయ రామచంద్రుం బిలువం బనిచి యుచి
తాసనంబున నుండ నియోగించి కొండొకసేపునకు నక్కు మారు నవలోకించి.

7


ఉ.

ఏను సమస్తదానములు నెల్లవ్రతంబులు సర్వధర్మముల్

  1. ఇచట భరతశత్రుఘ్నులు యుధాజిత్పురంబునకుఁ బోయి రనువృత్తాంత మీరామాయణమున లేదు. ఇది గ్రంథపాతముగ నుండును. కాదే నీవిషయము బాలకాండము కొనను గొందఱు నయోధ్యాకాండము మొదటఁ గొందఱును జెప్పుటఁబట్టి యీగ్రంథప్రణేతలు భిన్ను లగుటచే బరస్పరప్రత్యయమువలనఁ జెప్ప రయి రనియుఁ దోఁచుచున్నది.