పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రజల మీద బ్రిీటిష్‌ ప్రభుత్వం సాగించిన ప్రతి జులుం మీద ఆమె తన కవితలతో దాడులు చేశారు. ప్రభుత్వచర్యలను నిర్భయంగా నిరసించారు. ప్రభుత్వ చర్యల మీద విమర్శలు చేస్తున్న కవులు రాసిన కవితలను, ఆ రచనలను ప్రచురిస్తున్న పత్రికల మీద ప్రబుత్వం దాడులు చేసినప్పుడు, ఆయా పత్రికలకు, పత్రికా సంపాదకు లకు ఆమె అండగా నిలిచారు. జాతీయ భావాలను ప్రచారం చేస్తున్న పత్రికల మనుగడ కోసం అవసరమగు ఆర్థికతను అందించడనికి ఎంతో శ్రమించారు. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన పత్రికల ఆస్థిపాస్తులను అధికారులు జప్తు చేసి, పత్రికల సంపాదాకులను వీధుల్లో పడేసినప్పుడు వారికి తగిన విధంగా స్యయంగా సహయ,సహకారాలు అందించి పత్రికా సేfiచ్ఛ పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. కవయిత్రిగా, సంస్కరణవాదిగా జాహీదా ఖాతూన్‌ ప్రముఖ కవి పండితుల, పాఠకుల ఆశీస్సులతో పాటుగా, ప్రజల అపార ప్రేమాభిమానాలను అందాుకున్నారు. పేరు ప్రతిష్టల కోసం ఆమె ఎన్నడూ ప్రాకులాడలేదు. ఆమె ఎన్నడూ తన పేరును ప్రకించలేదు. జాహిదా , నుజహత్‌ ' అను కలం పేర్లతో ఆమె కవిత్వం సాగింది. (Encyclopadia of Women Biography, Ed. by Nagendra.K.Singh, APHPC,New Delhi, 2001,Page.484) మహిళల స్వేచ్చా,స్వాతంత్య్రాల కోసం మాత్రమే కాకుండ వలసపాలకుల దుష్టపాలన నుండి ప్రజల విముక్తిని ఆకాంక్షించిన ప్రముఖ కవయిత్రిగా వస్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రత్యే క స్థానం ఏర్పర్చుకున్నారు. ప్రముఖ జాతీయోద్యామకారుల సంపాదాకత్వంలో నడుస్తున్న, జమీందార్‌, అల్‌ హిలాల్‌, కామ్రేడ్‌ లాిం పత్రికలతో పాటుగా ఆనాటి ఇతర ప్రముఖ పత్రికలలో ఆమె కవిత్వంచోటు చేసుకుంది.

స్వేచ్ఛ, స్వాతంత్య్రేచ్ఛ, ప్రగతిశీల భావాలు, సంస్కరణల కోసం సాగిస్తున్న పోరాటం, ఛాందస భావాల మీద ప్రకటించిన యుద్ధ్దం, స్వార్థ రాజకీయాల మీద ఆమె సంధించిన విమర్శనాస్త్రాల తీవ్రతను గమనించిన ప్రముఖ ఉర్దూ కవి అక్బర్‌ అల్హాబాది ఆమె కవితల గొప్పదనం గురించి మ్లాడుతూ, ఒక వేళ ఈ కవితలను ఓ మహిళ రచిస్తున్నట్టయితే, ఇక కవిత్వం మీద పురుషులు తమ ఆధిపత్యం వదులుకోవాల్సిందే, అని వ్యాఖ్యానించటం ధైర్యశాలిగా, ఉత్తమ కవయిత్రిగా ఆమె స్థాయిని, స్థానాన్నివెల్లడి చేస్తుంది. ఆమె రాసిన కవితలలో కొన్నిAina+Haram, 88