పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

Firdus-i-Takhiyyul పేర్లతో సంకలనాలుగా ఆమె మరణాంతరం ప్రచు రితమయ్యాయి. (Who's who of Indian Writers, Sahithya Akademi, New Delhi, 1961) జాహిదా ఖాతూన్‌ కవయిత్రిగా కవితలతో ఉద్యామకారులను ఉత్తేజపర్చటం, మార్గదర్శకం చేయటం మాత్రమే కాకుండ స్వయంగా ఉద్యమ కార్యక్రమాలలో కూడ పాల్గొన్నారు. బెంగాల్‌ విభజన, స్వదేశీ ఆందోళన, సహాయ నిరాకరణ ఉద్యమాలలో భాగస్వామ్యాన్ని అందించారు. స్వదేశీ ఉద్యమంలో చురుకన పాత్ర నిర్వహించారు. ఖద్ధరు ధరించమని ఇతరులను కోరటం మాత్రమే కాకుండ, స్వజనుల వ్యతిరేకతను ఖాతరు చేయకుండ తాను స్వయంగా ఖద్దరును ఎంతగానో ఇష్టపడ్డాడరు. ఈ విషయమై ఆమె మ్లాడుతూ, స్వదేశీ ఉద్యమం అంటే నాకు చచ్చేంత ప్రేమ. ఇవాళే కాదు. తొలినాి నుంచి కూడ. ఇక ప్రస్తుత సంఘటన వల్ల విదేశీ వస్తువుల పట్ల భరించలేని వ్యతిరేకత ఏర్పడింది. అసహ్యం పుట్టింది. ఇక ముందు ఎన్నడూ విదేశీ వస్త్రాన్ని కొనరాదని నిర్ణయించుకున్నాను, అని ప్రకటించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్నివ్యక్తం చేయటం మాత్రమే కాకుండ ఖద్దరు ధారణ నిమిత్తం తనకు తానుగా ఆమె ఖద్ధరు వస్త్రాలను కోనుగోలు చేశారు. ఆ దుస్తులను జీవితాంతం ధరించాలని ఎంతో ముచ్చటపడ్డాడరు . దురదౄష్టం ఏమిటంటే ఆమె స్వయంగా కొనుగోలు చేసిన ఖద్దరు వస్త్రాలు ఆమె ధరించలేకపోయారు. ఆ ఖద్దరు దుస్తులు ఆమె మృతదహాన్ని మాత్రమే అలంకరించాయి. ఖద్ధరు వస్త్రాలు ధరించాలన్న నిర్ణయంతీసుకున్న 11 రోజులు వ్యవధిలో 1922 ఫిబ్రవరి 4న ఆకస్మికంగా తన 29 సంవత్సరాల వయస్సులో అవివాహితగా ఆమె కన్నుమూశారు.

ఆ సమయంలో ఆమె కొనుగోలు చేసిన ఖద్దరు వస్త్రాలను ఆమె సోదరుడు దావూద్‌ అహమ్మద్‌ ఖాన్‌ ఆమె భౌతికాయం మీద పరచి ఆమె అభిమతాన్ని ఆవిధంగా గౌరవిస్తూ జాహిదా ఖాతూన్‌ షేర్వానియా కోర్కెను నెరవేర్చారు.

భారతదేశపు కుక్కలు, పిల్లులు కూడ బ్రిీటిషర్ల బానిసత్వపు సంకెళ్ళలో బందీలుగా ఉండ రాదన్నది నా అభిమతం. - ఆబాది బానో బేగం 89