పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

విద్యాలయాలను విడిచి విద్యార్థులు బయటకు రావాలని మహాత్మా గాంధీ పిలుపు నిచ్చినప్పుడు ఆ నిర్ణయం ఆమెకు నచ్చలేదు. విద్యాభ్యాసం చేయాల్సిన విద్యార్థ్ధులు విద్యాలయాలు బహిష్కరిస్తే వారి చదువు ఎలా సాగుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ విషయ గురించి మ్లాడు తూ, సహాయ నిరాకరణోద్యామం ఆచరణలోని కొన్ని అంశాల్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఉద్యమంలో భాగంగా చదువులు మానేయడం నాకిష్టం లేదు, అని బాహటంగా కళాశాలల బహిష్కరణకు ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారు. చిత్తశుద్ది కరువైన స్వార్థపూరిత రాజకీయాలు, ఆ మార్గాన నడిచే రాజకీయ నాయకుల చర్య ల పట్ల కూడ ఆమె ఆగ్రహం వ్యకం చేశారు. మన రాజకీయ నాయకులు జనాన్నితమ గుప్ప్లో ఉంచుకునే మంత్రంగా, పేరు ప్రతిష్టల్ని పొందే చిట్కాగా, వెండి బంగారాన్ని సమకూర్చి పెట్టగల ఊటబావిలా భావించి రాజకీయాల్ని స్వీకరిస్తున్నారు. ఆ కారణంగా విశ్వమానవాళి హృదాయాల నుండి మన స్థానం దిగజారిపోతుంది, అంటూ స్వార్ధపరు లైన రాజకీయ నాయకుల వ్యవహార సరళి మీద ఆమె అక్షరాయుధంతో విరుచుకు పడ్డారు. ఆనాడు ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు ఈనాటి రాజకీయాలకు కూడ వర్తించటం ఆమెలోని దార్శనికతకు అద్దం పడుతుంది. స్వేచ్ఛా,స్వాతంత్య్రాల కోసం సాగుతున్నజాతీయోద్యా మంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు. ఉద్యమించమని మహిళలను స్వయంగా కోరారు. ప్రజలకు స్వతంత్ర జీవన అవకాశాలను కల్పించేందాుకు స్వాతంత్య్రసమరంలో కలసికట్టుగా పాల్గొనాలని జాహిదా ఖాతూన్‌ ఉద్బోధించారు. మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఉమ్మడిగా ముందుకు సాగాలని సూచించారు. హిందూ-ముస్లింల ఐక్యత అత్యంత అవశ్యం అన్నారు. ఆయా జనసముదాయాల మధ్య న అపార్థాలను దూరం చేసి సద్భావన, సదావగాహన ఏర్పచేందుకు జాహిదా ఖాతూన్‌ నిరంతరం శ్రమించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన ప్రతి ఉద్యమం,సంఘటన మీదా జాహిదా ఖాతూన్‌ షేర్వానియా కవితలు రాశారు. అభిప్రాయాలను వ్యకం చేశారు.

బాల్కన్‌ యుద్ధం, ప్రథమ ప్రపంచ యుధం, జలియన్‌వాలా బాగ్, కాన్పూరు మసీదు కేసు తదితర దుస్సంఘటనల మీద ఆమె తనవైన కవితలతో ప్రతిస్పందించారు. ఈ మేరకు తమ కవితలతో బ్రిీటిషు ప్రభుత్వచర్యల మీద విమర్శనాస్త్రాలు సంధించిన కవయిత్రిగా ప్రజల మనస్సులలో మాత్రమేకాకుండ స్వాతంత్య్రోద్యమం సాహిత్య చరిత్రలో 87