పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

వర్ణించనూ. ముస్లింను, భారతీయురాల్ని, నిజం పలికేదాన్ని, అన్నారు. ఈ దిశగా ఆమె రాసిన అనేక కవితలు ఆనాటి ప్రముఖ ఉర్దూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. జాహిదా ఖాతూన్‌ స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. స్త్రీలు అక్షర జ్ఞానసంపన్నులు కావాలని కలలుగన్నారు. ఆ కలలను సాకారం చేసేందుకు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని భావించారు. ఉత్తమ సమాజం విద్యావంతులైన తల్లుల ద్వారా రూపుదిద్ధుకుంటుందని దృఢంగా నమ్మారు. స్త్రీలు విద్యావంతులు కావటమే కాకుండ పురుషులతోపాటుగా కూడ రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు రాజకీయ రంగంలో కూడ రాణించాలన్నారు. అక్షరజ్ఞానం, రాజకీయ చైతన్యం గల మహిళలు మాతృభూమి కోసం త్యాగాలను చేయ గల నాయకులను, జాతిజనులకు ఉత్తమ సేవలందించగల ప్ధరులను రూపొందించగలరని ప్రకటించారు. మహిళలను రాజకీయాలకు దూరంగా ఉంచిన జాతి, సమాజం వెనుకబాటుతనానికి గురవుతుందని ఆమె హెచ్చరించారు.

ఈ విషయాన్ని మరింత విస్తారంగా చెబుతూ, గొప్ప వ్యక్తుల తల్లులందరూ ఓ ప్రత్యేక మనస్తత్వం కలిగిన మహిళలని మనకు చరిత్ర తెలుపుతుంది. విజేతల తల్లులు ధైర్య వంతులు, సంస్కర్తల అమ్మలు ఆలోచనాపరులు, మహాత్ముల తల్లులు మహనీయులుగా మనకు దర్శనమిస్తారు . వ్యకిగతంగా ఒక పురుషుడి నైతికత స్త్రీ ద్వారా రూపుదిద్దుకోవడమో లేక భ్రష్టు పట్టడమో జరుగుతుంది. ఓ జాతి నైతిక విలువలు, సామాజిక ఔన్నత్యం ఆ జాతికి చెందిన తల్లుల మానసిక స్థితితుల మీద ఆధారపడివుంటాయి. రాజకీయ ఔన్నత్యాన్ని గుత్తకు తీసుకున్నామని చెప్పుకునే జాతులను మనం పరిశీలిస్తే ఆ జాతులలోని మహిళలు రాజకీయంగా ఎంత పరిపక్వత కలిగి ఉండేవాళ్ళో, వాళ్ళల్లో మాతృభూమి పట్ల ప్రేమ ఎంత పొంగి పొర్లేదో మనకు అర్థమøతుంది. పురుషుల అస్తిత్వం తల్లి రూపంలోనూ, ప్రజా సంక్షేమానికి చెందిన ప్రతిశాఖలో బాధ్యతగల పౌరుని రూపంలో జాతికి, దేశానికి భగవంతుడు ప్రసాదించిన ఉత్తమ వరంలా రుజువయ్యింది, అని జాహిదా ఖాతూన్‌ షేర్వానియా అన్నారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdan : Page.182)

విద్యారంగంలో ముస్లిం మహిళల స్థాయి అధమంగా ఉన్న విషయం మీద ఆవేదన వ్యక్తం చేసిన జాహిదా ఖాతూన్‌ ఎంతో బాధపడ్డారు. ఆ స్థితి పట్ల బాధను 85