పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

వ్యక్తం చేయటంతో ఆమె ఊరుకోలేదు. ఈ స్థితికి గల కారణాలను కూడ ఆమె చాలా వివరంగా విశ్లేషించారు. ఈ దుస్థితికి కొందరు ముస్లిం మత పెద్దలు కారణమని ఆమె ఆగ్రహించారు. ఈ విషయం గురించి రాస్తూ, ముస్లిం మత పెద్దల తప్పు వొకటే. తమ స్త్రీలను చదువు సంధ్యల్లేని వాళ్ళుగా వుంచారు. లేకుంటే చదివించినా రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా వుంచారు. జాతి తల్లులలో రాజకీయ పరిజ్ఞానం లేనందున జాతి జనులలో కూడ రాజకీయాల పట్ల సరైన అవగాహనకు ఆస్కారం లేకుండ పోయింది. అందుచేత అవమానకరమైన, దయనీయమైన ఆహారంతో కడుపు నింపుకుని ఉన్నట్టయితే మీ ఆ చేష్టలకు ముగింపు పలికి భవిష్యత్తు గురించి జాగ్రత్త వహించండి. మీ చర్యల వలన కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకోడనికి మార్గం వొక్కటే. అది మీ స్రీలను విద్యావంతుల్ని చేయడం. విజ్ఞానార్జన ద్వారా సరైన రాజకీయ దృక్పథం, మంచి అవగాహన వారిలో కలుగచేయడం. ఆ ఆవకాశాలను వారికి కల్పించటం.' అని జాహిదా ఖాతూన్‌ షేర్వానియా సలహా ఇచ్చారు.(ibid.Page182)

ఆనాటిసామాజిక పరిస్థితులలో ఓ కులీన కుటుంబం నుండి విచ్చేసిన మహిళ కవిత్వం చెప్పటం మాత్రమే కాకుండ స్త్రీవిద్య కోసం, రాజకీయరంగంలో స్త్రీల ప్రవేశం కోసం పోరాడటం, ఆ రంగాలలో మహిళల వెనుకబాటుతనానికి ముస్లిం పెద్దలను బాధ్యుల్నిచేయటం, ఆ పెద్దల చర్య లను తప్పుపటడం, ఆ తప్పులను దిద్దుకోవాల్సిందిగా పెద్దలకు సలహా ఇవ్వటం నిజంగా సాహసం.

ఈ మేరకు తాను నమ్మిన విషయాన్నిస్పష్టంగానూ, ధైర్యంగానూ ప్రకంచటంలో ఆమె ఏనాడు వెనుకాడలేదు. ముస్లిం మహిళలు ధరిస్తున్న పర్దా విధానం సరైనది కాదంటూ, డాక్టర్లు అంటున్నారు బంధనాల నుండి బయట పడండి - గాలిని ప్రవేశింపనివ్వండని. సంకుచిత స్వభావులు అంటున్నారు. ససేమిరా వద్దు చావనివ్వండని, అని ఓ కవితలో అన్నారు. జాహిదా ఖాతూన్‌ పర్దా పద్దతికి పూర్తిగా వ్యతిరేకం కాకున్నా అనారోగ్య హేతువైన రీతిలో పర్దాను ధరించడాన్ని మాత్రం వ్యతిరేకించారు.(ibid.Page.180)

విద్యాభ్యాసం పట్ల అధిక మక్కువ చూపిన ఆమె జ్ఞానార్జనకు విద్యాభ్యాసం మాత్రమే మార్గమని భావించినందున అందుకు వ్యతిరేకాంశాలతో ఏమాత్రం ఏకీబవించ లేదు. సహాయ నిరాకరణ ఉద్యామంలో భాగంగా ప్రభుత్వం గ్రాంటులతో నడుస్తున్న

86