పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఆయన అధిక శ్రద్ధ చూపారు. పలువురు ఉపాధ్యాయులను నియమించి ఇటు సంప్రదాయక విద్య అటు ఆధునిక ఆంగ్ల విద్యలో ఆమెకు ప్రవేశం కల్పించారు. మంచి గురువుల చలువ వలన ఉత్తమ జ్ఞానాన్ని సంతరించుకున్న ఆమె తనలో దాగి ఉన్న కవయిత్రిని చిన్న వయస్సులోనే ప్రజల ఎదుట సాక్షాత్కరింప చేశారు. స్వంత అభిప్రాయాలను నిర్భయంగా, సాహసోపేతంగా తన కవితల ద్వారా వ్యక్తం చేయటం ఆరంభించారు. నా కవితల వైపు యావత్తు ప్రపంచం కన్నార్పకుండ చూడాలి. ఆ స్థాయి కవయిత్రుల కోవలో నా కవితా ప్రస్థానం సాగాలి. నన్ను మించిన కవయిత్రి మరోకరు ఉండరాదు, అని పది సంవత్సరాల వయస్సులో జాహిదా ఖాతూన్‌ ప్రకటించారు. ఆ ఆకాంక్షమేర సాగించిన కృషి మూలంగా ఆనాటి కవయిత్రులలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు.

సమాజాన్ని చదవటం, పరిణామశీలాన్నిఅధ్యయనం చేయటం ద్వారా సమకాలీన పరిస్థితులన్నటి మీద స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పర్చుకొని, ఆనాటి అమ్మాయిల తీరు తెన్నులకు భిన్నంగా మార్పు కోసం జాహిదా ఖాతూన్‌ నడుంకట్టారు. పది సంవత్సరాల వయస్సులో పది దశాబ్దాల వయస్కురాలి పరిపక్వతను తన కవితలలో ప్రతి ఫలింప చేశారు . ఆమెక్రమంగా ఎదుగుతూ , సమాజంలోని సనాతన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అక్షరాలను ఆయుధంగా మలచుకుని ఉద్యమించారు.

సామాజిక రుగ్మతల నిర్మూలనకు, సామాజిక సంస్కరణకు పూనుకున్నారు. స్త్రీ స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇచ్చారు. పురుషులతోపాటుగా స్త్రీలు కూడ స్వేచ్ఛగా తమ శక్తియుక్తుల మేరకు బాధ్యతలను నిర్వహిస్తూ, హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు.

ఆనాడు భారతీయ మహిళల పరిస్థితులను జాహిదా ఖాతూన్‌ తన కవితలలో ప్రతిఫలింప చేశారు. భారతీయ మహిళ గురించి రాద్దామని నా కోరిక. నా మనసంతా ఆందోళన. పదాల్నిఎక్కడ నుండి తేను? నా ఈ దుర్దశ పశ్ఛాత్తాపానికి గురి చేస్తుందే మోనన్నఆందోళనే ఎప్పుడూ. నా మాటలు పరాయి పదాలుగా అనిపిస్తూంటే, చెప్పనా? వద్దా? అను సందిగ్దం..?, అంటూ రాయడానికి పదాలు దొరకనంతగా మహిళల దుర్ధశ ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. నిజం పలకటం నేరంగా మారిందని, తాను భారతీయురాల్నికావటం, ముస్లిం కావటం, నిజం పలకటం ద్వారా మరింత నేరస్తురాల్ని అయ్యానని ఆవేదనను వ్యక్తంచేస్తూ, నేరాలకు ప్రతిరూపాన్నినేను. నా నేరాల్నిఎన్నని 84