పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలలో స్వాతంత్య్రేచ్ఛను రగిలించిన కవయిత్రి

జాహిదా ఖాతూన్‌ షేర్వానియా

(1894 - 1922)

మాతృదేశాన్ని పరదేశీయుల పాలన నుండి విముక్తం కావించేందుకు స్వాతంత్య్రేచ్ఛతో రగిలిపోతున్న అన్ని రంగాలకు చెందిన ప్రజలు విముక్తిపోరాటంలో తమదైన మార్గాలలో సాగారు. ఈ కృషిలో కవులు, కళాకారులు అద్వితీయ పాత్ర వహించారు.బ్రిటిషర్ల దుష్టపాలన మీద ద్వజమెత్తిన కలం యోధులు, దుర్మార్గపాలనను ఎండగడ్తూ, అందుకు వ్యతిరేకంగా పోరాడల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రజలను చెతన్యవంతుల్ని చేసూ, ఉద్యామకారులను ఉత్సాహపరు స్తూ అక్షరాయుధాలను సృస్టించారు. ఈ దిశగా సాగిన కృషిలో భాగం పంచుకున్న కవులు-కవయిత్రులలో జాహిదా ఖాతూన్‌ షేర్వానియా ఒకరు.

ఉత్తర ప్రదేశ్‌ రాష్రంలోని అలీఘర్‌ సమీప గ్రామమైన భిక్కంపూర్‌లో జాహిదా ఖాతూన్‌ షేర్వానియా 1894 డిసెంబరు 8న జన్మించారు. ఆమె తండ్రి నవాబ్‌ ముహమ్మద్‌ ముజ్‌మిలుల్లా ఖాన్‌ షేర్వాని. సంపన్నుడు మాత్రమే కాకుండ విద్యావేత్త కూడ అయిన ఆయన అలీఘ ర్‌ విశ్వవిద్యాలయం కులపతిగా బాధ్యతలు నిర్వహించారు. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయిన జాహిదా ఖాతూన్‌ను అన్నీ తానై పెంచారు. జాహిాదా చదువు పట్ల 83