పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఖిలాఫత్‌ కమిటీలో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించి గౌరవించారు.

ఆ తరువాత 1920 అక్టోబరు15న బేగం జాఫర్‌ అలీఖాన్‌ మరొక ప్రకటన జారీ చేసారు. ఈ ప్రకటన ద్వారా ఆమెలో నిబిడీకృ తమైన ధైర్య సాహసాలు చాలా స్పష్టంగా బహిర్గతమయ్యాయి. జమీందార్‌ లో ప్రచురితమైన ఆ ప్రకటనలో, పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ నియంతల్లా వ్యవహరిస్తుంటే, జనసముదాయాలన్నీ ఏకమైనియంతృత్వశక్తుల మీద విరుచుకుపడాలి...వినాశన మార్గం నుండి మంచి మార్గం వైపుకు పాలకవర్గాలు మళ్ళేంతవరకు ఉద్యమాలు ఉధృతంగా సాగాలి. అంతిమంగా ప్రజలు విజయం సాధిస్తారు. ..మన మాతృభూమి భవిష్యత్తు దృష్ట్యా, మన గౌరవాన్నికాపాడేందుకు ఈ గడ్డమీది ప్రతి హిందూ-ముస్లిం ఈనాడు భుజం భుజం కలిపి పోరాడాల్సిన బాధ్యత ఉంది. సహాయనిరాకరణ ద్వారా దుష్టపాలకులను నిస్సహాయులనుచేయాలి. ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ సహాయ నిరాకరణ చేప్టినట్టయితే, ఈ దేశం సమస్యలు, ఖిలాఫత్‌ సమస్య పరిష్కారమైపోతాయి...స్వదేశీ ఉద్యమ ఫలితాలను గమనించండి. మనమంతా విదేశీ వసువుల బహిష్కరణను ఉద్యమంగా

కొనసాగిస్తే సత్పలితాలను పొందగలం...ఈ రోజు నుంచి నేను విదేశీ వస్తువులను, బట్టలను త్యజిస్తున్నాను. నా ప్రాణం పోయినా విదేశీయత నా దేహాన్ని ముట్టుకోనివ్వను. భారత దేశంలో తయారైన బట్టలను, వస్తువులను మాత్రమే వాడుతానని ప్రమాణం చేస్తున్నాను., అని ఆమె పేర్కొన్నారు.

ఈ మేరకు ఆమె చేసిన ఆ ప్రమాణానికి బేగం జీవితపర్యంతం కట్టుబడి ఉన్నారు. మౌల్వీ జాఫర్‌ అలీఖాన్‌ వెంట ఆమె నిరంతరం నీడలా ఉంటూ స్వాతంత్య్రోద్యమంలో బేగం జాఫర్‌ అలీఖాన్‌ తనదైన భాగస్వామ్యాన్ని అందించి కృతార్థ్ధులయ్యారు.

                                                     * * *

మీ లాంటి యువకుల్లో రక్తం చల్లబడిపోయింది. మీలో పౌరుషం చచ్చిపోయిందా? మీ రక్తం ప్రతీకార జ్వాలతో వేడెక్కుతుందా? లేదా? మన మోచేతి నీళ్ళు తాగే కుక్కలు మనపై పెత్తనం చలాయిస్తున్నారు. దానిని మనం మౌనం గా భరిస్తున్నాం. మన వీరత్వం, శౌర్య పరాక్రమాలు ఏమైపోయాయి? - బేగం అజీజున్‌

82