పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు


సిద్ధపడేట్టుగా కార్యోన్ముఖులను చేసి, ఖిలాఫత్‌ ఉద్యమచరిత్రలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రకటనలో, నా భర్త మాట, రాత ద్వారా ఎటువంటి అపరాధం చేయలేదు... ఆయన కార్యక్రమాల గురించి, ఆయన లక్ష్య గురించి, ఆ లలక్ష్య సాధనా మార్గం గురించి నాకంటే బాగా ఎరిగిన వారుండరు.. నేరం చేయనివారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.... ఆయనకు నేనొక సలహా ఇచ్చాను.బ్రిటిష్‌ న్యాయస్థానం ఎటువంటి శిక్షనైనా విధించనివ్వండి, అది జైలు శిక్ష, బహిష్కరణ, జీవిత ఖైదు , ద్వీపాంతరవాసం, చివరకు ఉరిక్ష అయినా కానివ్వండి, తల వంచాల్సిన అవసరం లేదాన్నాను... భగవంతుని మార్గాన, మహమ్మద్‌ ప్రవక్త చూపిన బాటలో ఎంతి త్యాగానికైనా సిద్ధం కావాలి. పరీక్షకాలం చాలా కఠినంగా ఉంటుంది. భగవంతుడి కరు ణతో అన్నిఅవరోధాలు తొలిగి పోతాయి...భారతదశంలో సోదర-సోదరీమణులంతా ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం కోసం ఉద్యమించి, ప్రభుత్వంఅనుసరిస్తున్న అణిచివేత విధానాలను వ్యతిరేకించాలి..ఖిలాఫత్‌ ఉద్యమం ప్రతి ఒక్కరి నుండి అత్యున్నత స్థాయి అర్పణను ఆశిస్తుంది. ఈ ధర్మపోరాటంలో ప్రతి ముస్లిం ధనమాన ప్రాణాలు అర్పించేందుకు సర్వదా సిద్ధ్దంగా ఉండాల్సిన సమయమిది. అంతా కలసి రండి. భగవంతుని అనుగ్రహంతో ఖిలాఫత్ ను కాపాడుకుందాం, అంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ పిలుపును 1920 సెప్టెంబరు 24నాిి జమీందార్‌ పత్రిక ప్రచురించింది.

బేగం జాఫర్‌ అలీఖాన్‌ వ్యక్తంచేసిన దేశభక్తి భావనలు, బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల వెల్లడించిన అభిప్రాయాలు, బ్రిటిష్‌ న్యాయస్థానం ఎదుట తలవంచవద్దని, అవసరమైతే జాతిజనుల లక్ష్య సాధన కోసం ప్రాణత్యాగానికి కూడ సిద్ధపడమని భర్తను కోరటం ద్వారా జాతీయోద్యమం-ఖిలాఫత్‌ పోరాటాల పట్ల ఆమెకున్న దాఢమైన అభిప్రాయం ప్రజలను ఉతేజితుల్ని చేసంది. ఈ ప్రకటనలోని వాక్యాలు ఖిలాఫత్‌ కార్యకర్తలకు, నేతలకు ప్రాణపదవునాయి.

పరదాల చాటున కుటుంబ జీవనం సాగించే మహిళలలో త్యాగమయ జాతీయ భావనలు ఈ విధంగా స్పష్టం కావటం ప్రజలను ఆశ్చర్యచకతుల్నిచేసింది. ఆమె పిలుపు ఖిలాఫత్‌ ఉద్యామానికి కొత్త బలాన్ని సమకూర్చి పెట్టింది. ఆమె త్యాగనిరతి, దాఢనిశ్చయం, ఖిలాఫత్‌ ఉద్యమం పట్ల ఆమె వ్యక్తంచేసిన నిబద్ధతను గమనించిన ఖిలాఫత్‌ నాయకులు

81