పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ప్రబుత్వం అకృత్యాల మీద జాఫర్‌ అలీఖాన్‌ అక్షరాగ్యులను కురిపించారు. బ్రిటిష్‌ వ్యతిరేక పత్రిక జమీందార్‌ గొంతు నొక్కేయడానికి పలు విధాల ప్రయ త్నించిన ప్రభుత్వం చివరకు జమీందార్‌ పత్రికను, ఆ పత్రిక సంపాదాకులు మొఎల్వీ జాఫర్‌ అలీని శత్రువుగా పరిగణంచింది.

ఆ కారణంగా జాఫర్‌ అలీఖాన్‌ పలుసార్లు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన నగర బహిష్కరణకు గురయ్యారు. లాఠీ దెబ్బలు రుచిచూశారు.బ్రిటిష్‌ అధికారులు ఎంత క్రూరంగా వ్యవహరించినా, మొఎల్వీ మాత్రం ప్రభుత్వానికి తలవంచలేదు. మార్గం మార్చుకోలేదు. జమీందార్‌ పత్రికను జాతీయోద్యామానికి ప్రాణంగా తీర్చి దిద్దారు. ప్రజలలో పోరాట స్పూర్తిని రగిలించారు. ఆనాటిపత్రికలలో జమీందార్‌ పత్రిక ఉతమశ్రేణి ఉర్దూ పత్రికగా ఖ్యాతిగాంచింది. ఆ కృషి ఫలితంగా జాతీయోద్యామ చరిత్రలో మౌల్వీ జాఫర్‌ అలీఖాన్‌కు ప్రత్యేకస్థానం లభించింది.

ఆంగ్లేయ ప్రభుత్వం ఆయన పట్ల కినుక వహించింది. ఆయనకు వ్యతిరేకంగా పోలీసు అధికారులు సృష్టిస్తున్నభయానక పరిస్థితులను అధిగమిస్తూ మౌల్వీజాఫర్‌ అలీఖాన్‌ మున్ముందుకు సాగారు. బేగం జాఫర్‌ అలీఖాన్‌ కూడ ఆ బాటలో నడిచారు. ప్రజల పక్షం వహించిన కలంవీరుడు జాఫర్‌ అలీఖాన్‌ జీవిత భాగస్వామి గా ఆమె అత్యవసర పరిస్థితులలో ప్రత్యేక పాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారు.

బ్రిటిష్‌ ప్రబుత్వం మౌల్వీజాఫర్‌ అలీఖాన్‌ను 1920లో అరెస్టు చేసింది. ఆయనను అష్టదిగ్బంధనం చేయ డానికి అసత్య ఆరోపణలతో పకడ్బందీగా కేసును నమోదు చేసంది. ఈ వాతావరణాన్నిగమనించిన ప్రజలు, ఉద్యమకారులు వ్యధ చెందారు. మౌల్వీ జాఫర్‌ అలీ ఖాన్‌ గురించి, జమీందార్‌ పత్రిక భవిష్యత్తుగురించి ఆందోళన వ్యక్తం కాసాగింది. ఆ సమయంలో నేనున్నా..నేనున్నానంటూ బేగం జాఫర్‌ అలీఖాన్‌ రంగం మీదకు వచ్చారు. జమీందార్‌ పత్రిక ప్రచురణ బాధ్యతలను ఆమె స్వీకరించారు.

భారతావని నలుచెరు గులా ఉవ్వెత్తున ఎగసిపడు తున్న ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమకారులను, ప్రజలను, జమీందార్‌ పాఠకు లను ఉత్తేజపర్చుతూ, ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఎంతో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ప్రకటన ప్రజలలో జాతీయ భావాలను ప్రజ్వరిల్లచేసి, ఎటువంటి త్యాగాలకైనా వారిని 80