పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


శత్రువుకు లొంగేది లేదాన్నారు. బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ న్యాయమైన హక్కులను, తన వెంట నడిచిన స్వదేశీపాలకులను, సైనికులను, సేనాధిపతులను ప్రజలను కంపెనీ బలగాల దాయాదాక్షిణ్యాలకు వదిలి పెట్టలేనంటూ, ఆ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. నా ప్రాణం మీది తీపితో న్యాయమెన హక్కులను వదులుకునేది లేదని బేగం స్పష్టం చేశారు.

భారతదశ వ్యాపితంగా పలుప్రాంతాలలో ఆరంమైన తిరుగుబాట్లను అణచివేసిన, బ్రిటిష్‌ సైన్యాలు,సేనాధిపతులు చివరకు లక్నో మీద పూర్తిగా దృష్టి సారించారు. లక్నోను వీలయినంత త్వరగా పట్టుకోవలసిందిగా అధికారులకు గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్ నుండి ఆదేశాలందాయి. 1858 మార్చి 3-4 తేదిలలో బ్రిటిష్‌ సైన్యాధిపతి కోలిన్‌ భారీ సైనిక బలగాలతో లక్నోను చుట్టుముట్టాడు. ఆయనకు తోడుగా నేపాల్‌ ప్రభువు జంగ్ బహద్ధూర్‌ తన బలగాలతో మార్చి 11వ తేదిన ఆంగ్లేయాధికారులతో కలిశాడు. లక్నోను అన్నివైపుల నుండి శతృసైన్యాలు పూర్తిగా చుట్టుముట్టాయి. బేగం హజరత్‌ మహాల్‌ నివాసం కైసర్‌బాగ్ మీద ఆంగ్లేయ సైన్యాల ఫిరంగులు నిప్పుల వర్షం కురిపిస్తుండగా, సైనికుల తుపాకులు గుండ్ల వర్షం కురిపించసాగాయి.

ఆ సమయంలో బేగం హజరత్‌ మహాల్‌ తన వెంట తొమ్మిది వేల మంది సైనికులతో మూసాబాగ్ వద్ద కంపెనీ సైనికులతో చివరిసారిగా తలపడ్డారు. మిడతల దండులా అన్ని వైపుల నుండి వచ్చిపడిన శత్రు సైనికులను తట్టుకుని నిలవటం బేగం సెన్యానికి అతి కష్టంగా మారింది. పరిస్థితి ప్రమాదంలో పడందని గ్రహంచిన సహచరు లు ఆమెను రక్షిత స్థలానికి వెళ్ళ వలసిందిగా సూచించారు. ఆమె అక్కడ నుండి మరోచోటుకు వెడితే అది ఆంగ్లేయులకు విజయం లభించినట్టు కాగలదని భావించిన ఆమె పెనుముప్పు చుట్టుముట్టేంత వరకు ఆ ప్రాంతం నుండి కదాలలేదాు. చివరకు సహచరుల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితులలో మార్చి 16న హజరత్‌ మహాల్‌ లక్నో నుండి తప్పుకున్నారు. ఈ విధంగా తప్పుకుంటున్నప్పుడు కూడ తన క్షేమం కంటె తన వెంటనున్న వారి క్షేమం గురించి ఓ బాధ్యత గల నాయకురాలిగా ఆలోచించారు. ఆ సమయంలో కూడ తన వెంట నున్న ప్రముఖులంతా క్షేమంగా ఆంగ్లేయుల వలయం నుండి తప్పించుకుని వెళ్ళిన తరువాత బేగం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు.

బేగం సంరక్షణలోంచి అవధ్‌ జారిపోయాక కంపెనీ సైనికులు పెచ్చరిల్లిపోయారు. 1857 నాటి తిరుగుబాటులో మరెక్కడ ఎదురుకానంత పరాభవాన్ని చవి చూసిన 46