పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

కోసం 1857 డి సంబరు 22న సైనిక యోధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఉత్తేజపూరితంగా ప్రసంగిస్తూ, ' ఎందుకీ నిరీక్షణ..శతృవుతో తలపడేందుకు భయపడుతున్నారా?..బ్రిటిషర్లు తమ సైన్యాలను రప్పించేంత వరకు మీరు కూర్చోనే గడుపుతారా ? ముందుకు సాగండి. మీరు పోరాడుతారా ? లేదా ? చెప్పండి. పోరుబాటన నడువలేమంటే నేను ఆంగ్లేయులతో మంతనాలు జరిపి నా ప్రాణాలను కాపాడుకుంటాను. ఏ విషయం చెప్పండి ?', అంటూ సైనికులను, సెన్యాధిపతు లను నిగ్గదీశారు. ఈ సందర్బంగా సెనికుల మీద తూాటాల్లా ప్రయాగించిన ఆమె మాటలు తిరుగుబాటు యోధులలో ఆత్మ బలిదానానికి సన్నద్ధులను చేసి, పోరుకు ప్రేరేపించాయి. (Encyclopaedia of Women Biography Vol. II, Ed. by Nagendra.K.Singh, APH Publishing Corporation, New Delhi, 2001, Page.64)

ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీని బేగం సేనలు చుట్టుముట్టాయి. విజయమో వీర స్వర్గమో అంటూ పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాట సమయంలో బేగం అపూర్వ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. బిడ్డడు బిర్జిష్‌ ఖధీర్‌ను వెంట పెట్టుకుని ఏనుగు మీద ఆమె స్వయంగా రణభూమికి విచ్చేశారు. (Hazrath Mahal riding on an elephant encouraged her army by her presence on the field of battle, History of Freedom Movement in India, Dr. Tara Chand, Page. 85)

మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను, ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపర్చారు. పోరాటం భయంకరంగా సాగింది. ఆ పోరాటం గురించి తెలుసుకున్న లక్నో కమీషనర్‌,బ్రిటిష్‌ అధికారి హెన్రీ లారెన్స్‌ వ్యాఖ్యానిస్తూ, ' ఎక్కడ కూడ ఇంతకుమించిన శౌర్య ప్రతాపాలు మేము చూడలేదు ', అంటూ బేగం నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రశంసించాడు. ఈ పోరులో పలువురు కంపెనీ అధికారులు మృత్యువాత పడ్డారు . స్వదేశీ యోధులు ఎంతగా పోరాడినా రెసిడెన్సీ మాత్రం హజరత్‌ మహాల్‌ వశం కాలేదు.

ఆ సమయంలో బ్రిటిష్‌ అధికారుల నుండి సంధి ప్రస్తావన వచ్చింది. తిరుగుబాటుదారులకు క్ష్మమాబిక్షప్రసాదిస్తామని, బేగంకు ప్రతినెల 25వేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని, అందుకుగాను బేగం హజరత్‌ మహాల్‌ అవధ్‌ మీద తన అధికారాన్ని పూర్తిగా వదులుకోవాలని కంపెనీ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రస్తావన పట్ల బేగం మండిపడ్డారు. మా గడ్డ మీద మరొకరి పెత్తనమా? మా ప్రాణాలు పోయినా సరే 45