పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



హజరత్‌ మహాల్‌ బ్రిటిషు సైన్యాలతో చివరి పోరాటం జరిపిన మూసాబాగ్ ప్రాంతం ఆంగ్లేయాధికారులు, ఆంగ్ల సైనికులు అవథ్‌ రాజ్యం మీద పడి దోచుకున్నారు. సంపన్నవంతమైన లక్నోను పూర్తిగా ఛిద్రం చేశారు. అవథ్‌ పౌరులను దోచుకోవడమే కాకుండ భయంకర హింసలకు గురిచేశారు. యధేచ్చగా హత్యాకాండ సాగించారు.ఈ మేరకు తాము చేసన కిరాతక చర్య లను తమ వారికి ఉత్తరాల ద్వారా ఆంగ్లేయాధికారులు తెలుపుకున్నారు.

ఆతరువాత అవధ్‌ రాజ్యంలోని స్వదేశీ పాలకుల అధీనంలో ఉన్నపలు ప్రాంతాలు తిరుగుతూ పలుచోట్ల శత్రువును ఎదుర్కొంటూ, మరికొన్నిచోట్ల మిత్రుల ఆతిధ్యం పొందుతూ, బ్రిటిషర్ల దాడుల నుండి తప్పించుకుంటూ ఆమె ముందుకు సాగారు. ఆమె ఎక్కడకు వెళ్ళినా బ్రిటిషు సైన్యాలు ఆమెను వెంబడించ సాగాయి. ఓ క్షణం విశ్రమించేతీరికలేకుండ చేశాయి. ఆమెకు ఆశ్రయమిచ్చినవారిని ఇక్కట్లపాలు చేయ సాగాయి.

ఆ సమయంలో విద్రోహుల కుట్ర ఫలితంగా యోధుడు మౌల్వీ అహమదుల్లా షాను శత్రువులు బలితీసుకున్నారు. ఈ వార్త ఆమెను బాధించింది. పలు ప్రాంతాలలో తిరుగుబాటు యోధులు సాగిసున్న పోరాటాలలో అపజయాలు చవిచూడాల్సిన పరిస్థితు లు ఎదురవుతున్నాయి. ఆమె సహచరులు, స్వదేశీ పాలకులు రాజా బేని మాధావ్‌ సింగ్ 47