పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ఆ పరిస్థితు లలో కూడ ఆమె ఏమాత్రం అధర్య పడలేదు . ప్రజలను ఆకట్టుకుంటూ, స్వదేశీ పాలకులకు, తాలూకాదారులకు పలు రాయితీలు ప్రకించారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి జనరల్‌ హ్యావ్‌లాక్‌ తనకు లభించిన రెండు విజయాల తరువాత కూడ అవధ్‌ నుండి నిష్క్రమించటంతో బేగం శక్తిసామర్థ్యాల మీద నమ్మకం కుదిరిన స్వదేశీ పాలకులు, జమీందారులు తిన్నగా బేగం నాయకత్వం స్వీకరించి, నజరానాలు సమర్పించుకోవటం ఆరంభించారు. ఢిల్లీలోని మొగల్‌ చక్రవర్తి బహద్ధూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ తనను తాను ప్రకించుకున్నారు. ఆయన ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ అవధ్‌ పాలకునిగా పాలనను చేపట్టారు. కంపెనీ అధికారుల చర్య లతో నష్టపోయి, కంపెనీ పాలకుల పట్ల ఆగ్రహంగా ఉన్నస్వదేశీయులు ఆయనను అవధ్‌ పాలకునిగా అంగీకరించారు. ఈ మేరకు అవసరమగు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి.

ఆ అనుకూల వాతావరణంలో ప్రజల అవసరాలను తీర్చుతూ, శత్రువు దాడుల నుండి ప్రజలను కాపాడేందుకు లక్నో కోటనుపటిష్ట పర్చే కార్యక్రమాలను బేగం చేపట్టారు . ఆమె స్వయంగా తన లక్షలాది రూపాయలను వ్యయంచేసి కోటగోడలను పునర్మించారు. ప్రతి విషయాన్ని హజరత్‌ మహాల్‌ స్వయంగా పర్యవేక్షించసాగారు. ఆమె ఏనుగునెక్కి పనులు సాగుతున్న ప్రదేశాలకు చేరు కుని స్వయంగా పర్య వేక్షించటంతో ప్రజలు-సైనికులు ఉత్సాహభరితులయ్యేవారు.

ఆ సందర్బంగా అవధ్లోని ప్రజలనుద్దేశించి బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో, ' హిందూ- ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధానం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలనలో, స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు. కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. స్త్రీల మీదఅఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు...హిందూ-ముస్లిం పౌరులను హెచ్చరిసున్నాం. ఆత్మగౌరవంతో, ధర్మ బదాంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శతృ వులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపటండి. స్వదేశీ సైన్యంలో భర్టీకండి. ..మాతృదేశం కోసం సాగుతున్నపోరాటంలో భాగస్వాములు కండి. శతృ వుకు సహకరించ కండి.ఆశ్రయం ఇవ్వకండి..', అంటూ బేగం హజరత్‌ మహాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆ పిలుపుతో ఉత్తేజితులైన ప్రజలు, సైనికాధికారులు, అంతవరకు ఆమెకు దూరంగా 42