పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు



ఈ కమిటీ ప్రతి రోజు సమావేశమయ్యేది. ప్రతి అంశాన్నికమిటీ సభ్యుల ఎదుట పెట్టి చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటి అమలును బేగం పర్య వేక్షించారు. ఆనాి రాజరికపు రోజుల్లో ఆ విధంగా ప్రజాస్వామికంగా వ్యవహరించటం బేగం హజరత్‌ మహాల్‌ బుద్ధికుశలతకు నిదర్శనం. అన్ని రంగాలు పూర్తిగా ఆమె ఆధీనంలోకి వచ్చాక అవధ్‌ నవాబు బిర్జిస్‌ ఖధిర్‌ పేరిట వెలువడిన ప్రకటనలు అవధ్‌ రాజ్యంలో ఆంగ్లేయుల పాలన అంతటితో అంతమైందని ఆ ప్రకటనలు స్పష్టం చేశాయి. అంతటితో ఆమె మిన్నకుండి పోలేదు. సfiయంగా గుర్రం మీదా, ఏనుగు మీదా సవారి చేస్తూ ప్రజలను, ప్రముఖులను కలుస్తు ఆమె రాజ్యమంతా తిరిగి అందర్ని ఏకతాటి మీదకు తెచ్చేందుకు విజయవంతంగా ప్రయత్నించారు.

బేగం హజరత్‌ మహాల్‌ ఎటువంటి ప్రగతిశీల, సామరస్యపూర్వక విధానాలు చేపట్టినా, ఆమె శక్తిసామర్థ్యాల పట్ల విశ్వాసం కలుగని కొందరు స్వదేశీ పాలకులు, జమీందారులు ఆమె నాయకత్వాన్ని తొలుత ఆమోదించలేదు. అవధ్‌ అంతా అస్తవ్యస్థ పరిస్థితి, క్రమశిక్షణారాహిత్యం, వ్యక్తిగత స్వార్థంతో కంపెనీ పాలకులవైపు మొగ్గు చూపుతున్నవిద్రోహుల బెడదా, బేగం శక్తి సామర్థ్ధ్యాలను శంకించే జమీందారుల రగడ, స్వదేశీ పాలకుల, అధికారుల సమస్యలు ఒకవైపు, అవమాన భారంతో రగిలిపోతున్న కంపెనీ పాలకుల కుయుక్తులు మరోకవైపు బేగం హజరత్‌ మహాల్‌ను చుట్టుముట్టాయి. 41