పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

లదోనని భయపడి కంపెనీ పాలకుల ఆగ్రహానికి తమను బలి చేయవద్దాంటూ ప్రాధేయ పడుతూ నాయకత్వం స్వీకరణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్లిష్ట సమయంలో హజరత్‌ మహాల్‌ కంటకప్రాయమైన మార్గంలో కూడ చారిత్రక పాత్ర నిర్వహించేందుకు ఎంతో సాహసంతో ముందుకొచ్చారు. ప్రజల అభీయిష్టం మేరకు బిడ్డడు బిర్జిన్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకించేందుకు అంగీకరించారు. ఆ సందర్భంలో బేగం నిర్వహించిన పాత్ర, ఆమె త్యాగనిరతి, ఆత్మబలిదానం చిట్టచివరి వరకు శత్రువుకు లొంగని దీరత్వం చరిత్రలో ఆమెకు ప్రత్యేకస్థానం సంతరించి పెట్టాయి.

ఆ సమయంలో అవధ్‌ రాజ్యంలోని ఫైజాబాద్‌లో కంపెనీ పాలకుల బందీగా నున్న తిరుగుబాటు యోధుల నేత మౌల్వీఅహమ్మదుల్లా షాను, తిరుగుబాటు యోధులు విడుదల చేయించి ఆయనను తమ నాయకునిగా స్వీకరించారు. మౌల్వీ తన బలగాలతో లక్నోచేరుకుని కంపెనీ పాలకులను ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా బేగం హజరత్‌ మహాల్‌ బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా మరింత చొరవ తీసుకున్నారు. ఆ కారణంగా తిరుగుబాటు మరింత ప్రజ్వరిల్లింది. పది రోజుల్లో లక్నో అంతా పూర్తిగా తిరుగుబాటు సేనల పరమైంది.

బేగం హజరత్‌ మహాల్‌ తన బిడ్డ బిర్జిస్‌ ఖదీర్‌ను 1857 జూలై 5న అవధ్‌ నవాబుగా ప్రకటించారు. ఆ నిరయాన్ని పలువురు ప్రముఖులు బలపర్చారు. తిరుగుబాటు యోధులలో ఆనందం విల్లివిరిసింది. బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ పాలన ప్రారంభమైంది. ఆమె అధికారపగ్గాలను చేపట్టగానే పాలనా పరమైన చర్య లను చేపట్టారు . అన్ని సాంఘిక జనసముదాయాలకు పాలనాధికారంలో భాగం కలిగించే విధగా సమష్టి నిర్ణయాలకు అనుకూలంగా పాలనా వ్యవస్థ్దను రూపొందించారు. బహిర్గత శత్రువును ఎదాుర్కొనడానికి ప్రాణాలు పణంగా పెట్టే సైనికులకు అధిక ప్రాధాన్యత కల్పించారు. స్వదేశీ పాలకులు, నమ్మకమైన సైనికాధికారులకు, తిరుగుబాటు వీరులకు, స్వదేశీ భక్తులకు ప్రతిభా సామర్థ్యాల ఆధారంగా పలు విభాగాల బాధ్యతలను అప్పగించారు.

మతం, కులం, ప్రాంతాల ప్రసక్తి లేకుండ, పౌర-సైనికాధికార ప్రముఖులైన ముమ్మూఖాన్‌, మహారాజ బాలకృష్ణ, బాబూ పూర్ణచంద్‌, మున్షీ గులాం హజరత్ మహమ్మద్‌ ఇబ్రహీం ఖాన్‌, రాజా లాలా సింహ్‌, రాణా జిజియా లాల్‌, రాజా మాన్‌సింగ్, రాజా దేశిబక్ష్‌ సింగ్, రాజా బేణి ప్రసాద్‌ లాంటి వారితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. 40