పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

ఉన్న స్వదేశీ పాలకులు, అధికారులు బేగం పతాకం నీడన చేరుకున్నారు.(భారత్‌కి స్వాతంత్ర సంగ్రామం మేం ముస్లిం మహిళావోంకా యోగ్ దాన్‌, (హిందీ) -డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇస్టిట్యూట్ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢిల్లీ, 1997, పేజి.22) ఈ మేరకు పరిస్థితులు మరింత అనుకూలించి ప్రశాంత వాతావరణం ఏర్పడటంతో, అవధ్‌ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు బేగం నడుంకట్టారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ఫలితంగా పలు ప్రాంతాల నుండి లక్నోకు తరలి వస్తున్న తిరుగుబాటు యోధులకు, వేలాది సైనికులకు ఆమె ఆశ్రయం కల్పించాల్సి వచ్చింది. ప్రముఖ తిరుగుబాటు నాయకులు నానా సాహెబ్‌ పీష్వా, జనరల్‌ బక్త్‌ ఖాన్‌ రొహిల్లా, మొగల్‌ రాజకుమారుడు ఫిరోజ్ షా తమ భారీ సెనిక బలగాలతో లక్నో చేరు కుంటున్నారు.

ఈ నేతలకు, ఆ నేతల పరివారానికి, వారి సైన్యాలకు వసతి స్ధకర్యాలు సమకూర్చటం బేగంకు కడుభారంగా మారింది.ఈ పరిస్థితులు ఖజానా మీద అధిక భారమయ్యాయి. చివరకు ఖజానా ఖాళీ అయ్యింది. ఆమె వ్యక్తిగత సంపద కూడ ఖర్చయిపోయింది. గత్యంతరం లేని పరిస్థితులలో ధనికులు, సంపన్నవర్గాల మీద 'యుద్ధపన్ను' అంటూ ప్రత్యేక పన్ను విధించారు. ఆ నిర్ణయానికి సహజంగా మిశ్రమ స్పందన లభించింది. ఆ విధంగా సమకూర్చిన ధనం కూడ సరిపోక పోవడంతో ఆమె అధికారులు కొందరు తిరుగుబాటు వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నసంపన్నుల కుటుంబాల నుండి బలవంతంగా ధన సంపదలను వసూలు చేయసాగారు. ఆనాటి క్లిష్ట పరిస్థితులలో కూడ బేగం హజరత్‌ మహాల్‌ ఎంతో బుద్ధి కుశలతతో ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ, ఆంగ్లేయులను ఎదుర్కొనేందుకు సైనికంగా సన్నద్ధులు కాసాగారు. ఈ మేరకు 1,80,000 మంది సైనికులను ఆమె సమకూర్చుకున్నారు. బ్రిటిషు బలగాలతో ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధ్దమయ్యారు.

ఈ పరిస్థితులను గమనించిన బ్రిటిష్‌ అధికారి విలియం రస్సెల్‌, '..బేగం మాతో అప్రకటిత యుద్ధం ప్రారంభించింది...ఈ రాణులు, బేగంల శ్లాఘనీయ, శక్తివంత చరిత్రలను గమనించాక, అంత:పురంలో పర్దాల చాటున ఉంటూ కూడ ఎంతిటి శక్తి యుక్తులు సంతరించుకోగలరో తెలుసుకున్నాం..' అని వ్యాఖ్యానించాడు. (భారత్‌కి స్వాతంత్ర సంగ్రామం మే ముస్లిం మహిళావోంకా యోగ్ దాన్‌, పేజీ.42) 43