పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు


విరుచుకు పడుతున్న భయానక వాతావరణంలో విప్లవ వీరుడు ఖుదీరాంను రక్షించు కునేందుకు విఫల ప్రయత్నం చేశారామె. బ్రిీటిష్‌ గూఢచారి వర్గాల కళ్ళుగప్పి జాతీయ ఉద్యామకారులకు సమాచారాన్ని చేరవేసే కొరియర్‌గా సఫియా వాజిద్‌ చురుకైన పాత్ర నిర్వహించారు. ఈ వరుసలో కంటక ప్రాయమైన విప్లవబాటను ఎంచుకుని ఆత్మార్పణకు సిద్ధపడిన రజియా ఖాతూన్‌ లాింటి మహిళలు ఎందారో ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొనటమేకాక, జమీందార్ల జులుంను సాయుధంగా ఎదాుర్కొన్న వారిలో కూడ ముస్లిం మహిళలున్నారు. సింధ్‌ ప్రాంతానికి చెందిన మాయి భక్తావర్‌ ఆ కోవకు చెందినవారు. తన గ్రామానికి చెందిన రైతుల కష్టార్జితాన్ని దోచుకో చూసిన జమీందారు గూండాలను, జమీందారుకు వత్తాసుగా వచ్చిన పోలీసులను సాయుధంగా ఎదుర్కొని ఆ పోరులో వీరమరణం పొందిందారామె. ఈ విధంగా పోరాడిన వీరవనితలు ఎందారో ఉన్నాప్రచారం లభించినవారు చాలా తక్కువ.

నవభారత నిర్మాణంలో...

స్వాతంత్య్రోద్యమం వేగం అందుకుని లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న దశలో ఉద్యమంలో భాగస్వాములైన ఆనాటి మహిళలంతా అదృష్టవంతులు. ఆ తల్లులంతా తాము కలలుగన్నస్వతంత్ర భారతావనిని కళ్ళారాగాంచటమేగాక, కొందరు నవభారత నిర్మాణంలో బృహత్తరమైన బాధ్యాతలు నిర్వహించారు. ఈ తరంలోని ముఖ్యలలో ఒకరు జుబేదా బేగం. చిన్ననాటనే ఉద్యమబాటన నడక ప్రారంభించిన ఆమె అద్భత వక్త. సుసంపన్నకుటుంబంలో జన్మించిన ఆమె తన సర్వస్వం జాతీయోద్యమానికి సమర్పించారు. చివరి దశలోకటిక పేదరికం అనుభవిస్తూ కూడ ప్రభుత్వం ప్రకించిన పెన్షన్‌ స్వీకరించ నిరాకరించారు. పెన్షన్‌ స్వీకరించటమంటే తన మాతృదేశ సేవకు ఖరీదు కట్టడమేనంటూ, ఎటువంటి ఆర్థిక సహాయం స్వీకరించకుండ గడిపారు. ఈ రకంగా భారత ప్రభుత్వం ఇవ్వజూపిన అనేక రకాల ఆర్థిక సహాయాన్ని మర్యాదాపూర్వకంగా తిరస్కరించిన వారెందరో ఉన్నారు. ఈ మేరకు ఉద్యమంలో భాగంగా గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ప్రముఖుల్లో శ్రీమతి అముతుస్సలాం ఒకరు. నౌఖాళి మతకలహాల నివారణకు గాంధీజీ ఆమెను పంపారు. కలహాల నివారణకు గ్రామీణులు సహకరించకుండ మంకుపట్టు పట్టడంతో 22 రోజులపాటు నిరాహారదీక్ష పూని ఆ ప్రాంతంలో శాంతి సామరస్యాన్నినెలకొల్పిన

29