పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ఆమె గాంధీజీ ప్రశంసలందాుకున్నారు. బేగం రెహనా తయ్యబ్జీ గాంధీజీకి ఉర్దూ భాషను నేర్పిన గురువయ్యారు. పండు వయస్సులో కూడ బేగం లుక్మాని పోరాట పటిమ చూపారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో బేగం ఫాతిమా ఇస్మాయిల్‌ చురుగ్గా వ్యవహరించారు. బొంబాయి నగరంలో 30 సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా శ్రమించి ఐదు లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దటంలో అనితర సాధ్యమైన విజయాన్ని బేగం కుల్సుం సయాని సొంతం చేసుకున్నారు. ఆమె వయోజన విద్యావ్యాప్తి కోసం ప్రత్యేకంగా పలు భాషలలో రహబర్‌ అను పత్రికను కూడ నడిపారు. జాతీయోద్యమంలోని ప్రతి ఘట్టంలోనూ పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమకారులచే హాజౌరా ఆపాగా (హాజౌరా అక్కయ్య) హాజౌరా అహమ్మద్‌ పిలిపించుకున్నారు. రష్యాను సందర్శించిన తొలి భారతీయ మహిళగా ఆమె ఖ్యాతిగాంచారు. ఆంధ్ర రాష్ట్రంలోని మంతెనవారి పాలెంలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతులలో ఆమె పాల్గొన్నారు. ఈవిధంగా అంకిత భావంతో విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిలో ఆదర్శవంతమైన సేవలకు అంకితమైన బేగం సుఫియా సోం, ఆత్మరక్షణకు ఆయుధం ధరించిన బేగం సుల్తానా హయాత్‌, గాంధీజీ నేతృ త్వంలో ఆదర్శ వివాహం చేసుకున్నబేగం ఆమనా ఖురేషి, పోరుబాటలో నడిచినందుకు అరెస్టయిన డిల్లీలోని తొలి మహిళా కార్యకర్త బేగం మహబూబ్‌ ఫాతిమా లాింటి వారెందరో ఉన్నారు.

తెలుగింటి ఆడపడుచులు

ఈ కోవకు చెందిన వారిలో తెలుగింటి ఆడపడు చులూ ఉనాflరు. అటువంటివారిలో మహమ్మద్‌ గౌస్‌ ఖాతూన్‌, హజౌరా బీబీ ఇస్మాయిల్‌, నఫస్‌ ఆయేషా బేగం, రబియాబీ తదితరులు ఉన్నారు. చీరాల-పేరాల ఉద్యామంలో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధుడు గౌస్‌ మెహిద్దీన్‌ భార్య ఖాతూన్‌, భర్తతోపాటుగా జైలుకు వెళ్ళ కపోయినా, ఉద్యమకారులకు ఆశ్రయం కల్పిస్తూ, ఆతిథ్యమిస్తూ, తన కుటుంబానికి చెందిన సర్వం ఉద్యమం కోసం వ్యయం చేసిన త్యాగశీలి. గాంధీజీ అనుచరుడుగా రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన ఖద్దార్‌ ఇస్మాయిల్‌ భార్య హాజౌరా బీబీ గాంధీజీ బాటన నడిచినందుకు ఆమె కుటుంబాన్ని వెలివేసినా వెరవని ధీమంతురాలు. అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామానికి చెందిన రబియాబీ భర్త మొహిద్దీన్‌ సాహెబ్‌తో కలసి సత్యాగ్రహంలో పాల్గొని చరిత్ర సృషించారు. ఆంధ్రావనిలో ఒక ముస్లిం


30