పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


జాతీయోద్యమ ప్రధాన ఘట్టాలన్నిటిలో ఆమె ప్రముఖ పాత్ర వహించి సాహస మహిళగా ఖ్యాతిగాంచిన నిర్మొహమాిటి. భర్త మౌలానా హస్రత్‌ మొహాని సంపూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ప్రతిపాదించగా దానిని గాంధీజీ తిరస్కరించినందుకు ఆగ్రహించిన ఆమె గాంధీజీ వైఖరిని నిశితంగా విమర్శించి, చివరకు గాంధీజీచే శభాష్‌ అన్పించుకున్న ప్రతిభాశీలి. మంచి రచయిత్రి. ఈ వరుసలో అలీ సోదారులలోనిషొకత్‌ అలీ భార్య అంజాదీ బేగం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్పూర్తిగా నిల్చిన జులేఖా బేగం, స్వాతంత్రేచ్ఛను రగిల్చే సాహిత్యాన్ని సృషించిన కవయిత్రి జాహిదా ఖాతూన్‌, ఆలోచనాత్మక ప్రసంగాలకు పెట్టింది పేరైన అక్బరీ బేగంలను పేర్కొనవచ్చును. బ్రిీటిష్‌ పోలీసులు గుర్రాలచేత తొక్కించినా, లాఠీలతో రక్తసిక్తం చేసినా పోరుబాట వీడని హమీదా తయ్యాబ్జీ, గాంధీజీచే మధ్యపాన నిషేధ ఉద్యామనేతగా నియుక్తురాలైన అమీనా తయ్యాబ్జీ, బ్రిీటిష్‌ పోలీసు మూకల దాష్టీకాన్ని ఎదాుర్కొన్న షపాతున్నీసా బేగం, ఆదర్శ జాతీయవాదిగా ఖ్యాతిగాంచిన మజీదా బాను, జలియన్‌వాలా బాగ్లో జనరల్‌ డయ్యర్‌ ఘాతుకానికి బలైన 55 సంవత్సరాల వీరమాత ఉమర్‌ బీబీ గౌరవప్రదమైన మరణం బానిస బతుకుకంటే మేలైనదని చాటిన బేగం మహమ్మద్‌ ఆలంలు జాతీయోద్యమంలో ప్రముఖపాత్ర వహించారు. జాతీయ కాంగ్రెస్‌ జనచైతన్య కార్యక్రమాలలో ప్రముఖపాత్ర నిర్వహించారు ఫాతిమా బేగం. జాతి ప్రయోజనాలకు తమ సంపద ఉపయోగపడకపోతే అది ఎంత ఉన్నా వ్యర్థమంటూ షంషున్నీసా అన్సారీ తమ యావదాస్తిని జాతీయోద్యమానికి ధారపోశారు. భర్త పాలకుల కిరాతకానికి గురైనప్పిటికీ ఆయన బాధ్యాతలను స్వీకరించి ఉత్తేజపర్చ ఉత్తరాలతో స్వాతంత్య్ర సమరయూధులలో ఉత్సాహాన్నినింపారు బేగం జాఫర్‌ అలీఖాన్‌. గాంధీజీ కోరిక మేరకు క్రమం తప్పక ఆయనకు లేఖలు రాస్తూ, ఆయన ఉర్దూబాషను బేగం జోహరా అన్సారి తీర్చిదిద్దారు. ఈ మహిళలంతా తాము కలలుగన్న ' స్వతంత్ర భారతాన్ని ' కళ్ళారా చూడకుండనే పరలోకగతులయ్యారు.

సాయుధపోరాట మార్గంలో...

అహింసా మార్గాన్నేకాకుండ ప్రమాదబరితమైన సాయుధపోరాట మార్గాన కూడ పలువురు ముస్లిం మహిళలు ఉద్యమించారు. ఖుదీరా కి దీదిగా ఖ్యాతిగాంచిన విప్లవ వీరుడు మౌల్వీ అబ్దుల్‌ హదీమ్‌ సోదరి వీరిలో ఒకరు. ఆమె అసలు పేరు తెలియదు. విప్లవకారుల మీద, వారి సన్నిహితుల మీద, సానుభూతిపరుల మీద బ్రిటిష్‌ ప్రబుత్వం


28