పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఉజ్వలంగా మలచుకున్నారు. ఆ దంతుల తొలి సంతానంగా అక్బర్‌ జెహాన్‌ బేగం జన్మించారు.

అక్బర్‌ జెహాన్‌ బేగం మంచి కాన్వెంటు విద్యను గరిపారు. విద్యార్థిగా మంచి తెలివితేటలను ప్రదర్శించిన అక్బర్‌ జెహాన్‌ చక్కనిసౌందర్యరాశిగా ప్రజల మనస్సులను దోచుకున్నారు. ఆమె అందంలో అగ్రగామి మాత్రమే కాకుండ ధర్య సాహసాలలో కూడ అగ్రగణ్యురాలుగా ఖ్యాతిగాంచారు. చిన్నతనంతో తన తల్లికి సంబంధించిన గుజ్జర్‌ కమ్యూనిటీ ప్రజలు దూరం కావటం, తండ్రి పరదేశం నుండి వచ్చి కశ్మీరులో స్థిరపడిన వ్యక్తి కావటంతో ఆ కుటుంబం తొలిదశలో పలు ఇక్కట్లను ఎదుర్కొంది. తొలి సంతానంగా ఆ ఇక్కట్లును స్వయంగా అనుభవించిన అక్బర్‌ జెహాన్‌ బేగం ధైర్యశాలిగా స్వతంత్ర భావనలతో ఎదిగారు.

చిన్నవయస్సులో కరామత్‌ షా అను ఓ మత గురువుతో ఆమె తల్లితండ్రులు వివాహం జరిపించారు. ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడలేదు. చివరకు ఆక్బర్‌ జెహాన్‌ బేగం భర్తను నుండి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె 1932లో షేక్‌ ముహమ్మద్‌ ఇబ్రహీం కుమారుడు, షేర్‌-యే-కశ్మీర్‌గా ఖ్యాతిగాంచిన షేక్‌ ముహమ్మద్‌ అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు. ఆమె వివాహాన్ని ప్రముఖ కవి డక్టర్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ తోడ్పటుతో ముఫ్తీ జియాయుద్దీన్‌ నిర్వహించారు.

విద్యాధికుడైన డక్టర్‌ అబ్దుల్లా తొలి నుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయడనకి ఆసక్తి చూపారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలు విద్యావంతులైన తన మిత్రులతో కలసి రీడింగ్‌ రూం పార్టీ అను సంస్థ ఏర్పాటుకు దారి తీశాయి. ఈ సంస్థద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి వ్యవస్థాగతంగా శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో కశ్మీర్‌ ప్రజల సమస్యలను బయటి ప్రపంచానికి తెలియచేసేందుకు రీడింగ్‌ రూం పార్టీ సభ్యులు కృషిచేశారు. ఆ ప్రయత్నాలు ప్రజల మన్నన పొందాయి, కశ్మీరేతర ప్రజల అభినందనలు డాక్టర్‌ అబ్దుల్లాకు దక్కాయి. ఆ అనుభవంతో 1932లో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆయన ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలికల్‌ కాన్పెరెన్స్‌ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పేరులో ముస్లిం అని పదం ఉన్నా, ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్పెరన్స్‌ కమ్యూనల్‌ పార్టీ ఏమాత్రం కాదన్నారు. కశ్మీర్‌ ప్రజల ఉద్యమం మతఉద్యమం కాదని ఇది రాజకీయ ఉద్యమమని ఆయన

272