పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

అన్నారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని డాక్టర్‌ అబ్దుల్లా ప్రకించారు. ‘Muslim conference is not a communal organization and its existence will help all communities living in the State. The Kashmir agitation is not a communal movement but a political movement for redress of all people living in the state. We assure all our brethren whether they be Sikhs or Hindus, that we are ready to fight for their cause also ‘ - Encyclopedia of Muslim Biography, Ed. by Nagender Kr. Singh, APHPC, New Delhi, 2001, Page. 173)

ఆ ప్రకటన మేరకు అబ్దుల్లా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారు. మతంతో సంబంధ లేకుండ ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముసిం పొలిటికల్ కాన్పెరన్స్‌లో అందరికి ప్రవేశం కల్పించారు, ఆ సందర్భంలో బేగం అక్బర్‌ జెహాన్‌ భర్త అబ్దుల్లాకు తోడుగా నిలిచారు. ఆ క్రమంలో మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్‌, పండిత నెహ్రూ, అలీ సోదరుల ప్రబావంతో 1938 ప్రాంతంలో అబ్దుల్లా తన ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్పెరెన్స్‌ను ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ నేషనల్‌ పొలిటికల్‌ కాన్పెరెన్స్‌గా మార్చారు.

ద్వితీయ ప్రపంచ సంగ్రామం సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ నేషనల్‌ పొలిటికల్‌ కాన్పెరెన్స్‌ కూడ క్విట్‌ఇండియా తీర్మానానికి మద్దతు పలికింది. జాతీయ కాంగ్రెస్‌ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. జమ్మూ-కశ్మీర్‌లో క్విట్ ఇండియా నినాదం ప్రతిధ్వనించింది. ఈ సందర్బంగా డాక్టర్‌ అబ్దుల్లా మ్లాడుతూ ఇండియా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇండియా భూభాగంలోని నాల్గవ వంతు కలిగి ఉన్న సంస్థానాధీశులు స్వరాజ్యం విషయంలో విద్రోహులయ్యారు. సంస్థానాధీశులు వెళ్ళిపోవాలన్న డిమాండ్‌క్విట్ ఇండియా ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే, అని ఆన్నారు.

‘India is fighting against imperialism. The rulers of the Indian States who posses’ 1/4th of the country have always played the role of the traitors to the cause of Indian Freedom. The demand that the Princely States should quit is a logical extension of the policy of Quit India’ Encyclopedia of Muslim Biography: Page. 174)

273