పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజల భవిష్యత్తు ప్రజలే నిర్ణయించుకోవాలని కోరిన

బేగం అక్బర్‌ జెహాన్‌

(1916-2000)

స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మహిళలు తొలిదశలో భర్తల ప్రోత్సాహంతో రంగ ప్రవేశం చేసినా ఆ తరువాత ఉద్యామబాటలో ఎదురయ్యే పరిస్థితులనుబట్టి తమ వ్యక్తిత్వాలను, సంపూర్ణ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించి చరిత్ర సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. బేగం హసరత్‌ మోహాని, కుల్సుం సయాని, సాదాత్‌ బానో కిచ్లూ షంషున్నీసా అన్సారి ఈ కోవలోకి వస్తారు. ఆ కోవకు చెందిన కశ్మీరి మహిళ బేగం అక్బర్‌ జెహాన్‌.

అక్బర్‌ జెహాన్‌ 1916లో కశ్మీర్‌లోని గుజ్జర్‌ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి గుజ్జర్‌ కమ్యూనిీకి చెందిన ఆడపడుచు కాగా తండ్రి మైఖేల్‌ హ్యారి నిడోయ్‌ (Harry Nedou). తల్లి తండ్రులది ప్రేమ వివాహం. ఆమె తండ్రి మైఖేల్‌ హ్యారి నిడోయ్‌ క్రైస్తవ మతానికి చెందిన సంపన్న వ్యాపారి. ఆయన ఇస్లాం మతం స్వీకరించి తన పేరును షేక్‌ అహమ్మద్‌ హుస్సేన్‌గా మార్చుకున్నారు. షేక్‌ అహమ్మద్‌ హుస్సేన్‌ అక్బర్‌ జెహాన్‌ బేగం తల్లిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం వలన తల్లి సంబందీకులైన గుజ్జర్‌ కమ్యూనిటీకి ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేసి వారికి దూరమయ్యారు. ఆ వ్యతిరేక పరిస్థితులలో కూడ ఆ దంపతులు ఎంతో ధైర్యంతో తమ జీవితాలను

271