పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

లభించాయి. 1957లో Congress Legislative Party Deputy Leader గా నియమితులయ్యారు. ఆ సంవత్సరంలోనే Member-in-Charage-International Relations గా ఎంపికయ్యారు. ఆ పదవిలో ఆమె తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. (The Legend Makers Some Eminent Muslim Women of India, Gouri Srivastava, Concept Publishing Company, New Delhi, 2003, Page. 91)

ఆ తరువాత ప్రముఖ కాంగ్రెస్‌ నేత దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో సాంఫిుక సంక్షేమం, ముస్లిం ఎండోమెంట్స్ శాఖా మంత్రి పదవి ఆమెకు లభించింది.ఈ పదవిలో 1960 నుండి 1962 వరకు కొనసాగి, ఆంధ్రప్రదేశ్‌ తొలి మంత్రి వర్గంలో తొలి మహిళా మంత్రిగా, తొలి ముస్లిం మంత్రిగా, మొత్తం భారత దేశంలోనే మంత్రిపదవిని నిర్వహించిన తొలి ముస్లిం మహిళగా మాసుమా బేగం చరిత్ర సృష్టించారు.

1962లో ఫతర్త్‌ఘట్టి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ మీదా పోటిచేసి ఆమె పరాజితులయ్యారు. అప్పి నుండి ఆమె సమాజసేవాకార్యక్రమాలకు పరిమితమయ్యారు. ప్రభుత్వ పరంగా వివిధ మహిళా, శిశు సంక్షేమ సంస్థలు, విద్యావాప్తి సంఘాలలో పలు బాధ్యాతలు చేపట్టారు. హైదారాబాద్‌లోని అంజుమన్‌-యే-ఖవాతీన్‌, లేడు హైదారీ క్లబ్‌ ప్రధాన సభ్యురాలుగా, రెడ్‌క్రాస్‌ సంస్థ కార్యనిర్వాహక సమితి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

మంచి వక్త, కార్యదక్షురాలుగా ఖ్యాతిగాంచిన మాసుమా బేగం అఖిల భారత మహిళా సంస్థ నేతగా 1957లో కొలంబో, అఖిల భారత మహిళా సంస్థ ప్రతినిధి మండలి డిప్యూటీ నాయకురాలిగా 1959లో రష్యా, ఐక్యరాజ్యసమితి సమావేశాలకు జెనివా వెళ్ళి వచ్చారు. ఆ తరువాత యుగస్లోవియా, ఇండోనేషియాలలో పర్యిటించారు. ఈ మేరకు అటు రాజకీయ రంగాన, ఇటు సేవారంగాన మాత్రమే కాకుండ సాహిత్య రంగాన కూడ అగ్రగామి అన్పించుకున్న మాసుమా బేగం 1990లో కన్నుమూశారు.

268