పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహిళా చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించి

బేగం షరీఫా హమీద్‌ అలీ

జాతీయోద్యమంలో రాజకీయ -సాంఘిక సంస్కరణలు సమాంతరంగా సాగాయి. ఆనాటి రాజకీయాలలో ప్రత్యక్ష్యంగా పాల్గొనలేక పోయిన ఉద్యామకారులు సామాజిక సంస్కరణల పోరులో భాగస్వాములయ్యారు. ఈ విధగా రాజకీయాద్యమంలో పరోక్షంగా పాల్గొంటూ సంస్కరణోద్యమంలో పత్యక్ష్యంగా కార్యాచరణకు దిగిన యోధులలో బేగం షరీఫా హమీద్‌ అలీ ఒకరు.

ప్రగతిశీల భావాలను స్వాగతించే కుటుంబంలో ఆమె జన్మించారు. ఉర్దూ, గుజరాతీ, ఆంగం, సింధి, మరాఠి, ప్రెంచ్‌ భాషలను నేర్చుకున్నారు. చిత్రకళ, సంగీతంలో మంచి పట్టు సంపాదించారు. ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారి హమీద్‌ అలీని ఆమె వివాహం చేసుకున్నారు.

భర్త హమీద్‌ అలీ ప్రోత్సాహంలో ఆమె భాషాపరమైన సామర్ధ్యాన్ని మరింత పెంచుకుంటూ, సంగీతం, కళా సాంస్కృతిక కార్యక్రమాలలో పూర్తికాలాన్నివ్యయం చేస్తూ ఆయా రంగాల అభివృద్దికి కృషి ఆరంభించారు. 1907లో కలకత్తా నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె భాగస్వాములయ్యారు. ఆనాటి నుండి జాతీయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన

269