పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేశారు. ఆ శాఖకు ప్రధాన కార్యదర్శిగానూ, అధ్యక్షురాలిగాను ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఆ సందర్భంగా మహిళలచే అఖిల భారత మహిళా సంస్థ శాఖలను ప్రారంభింపచేసి ఆ సంస్థ కార్యకలాపాలను పర్య వేక్షించారు. ఈ మేరకు ఆమె నిర్వహించిన సేవలకు గుర్తింపుగా ఆమెకు అఖిల భారత మహిళా సంస్థ ఉపాద్యక్ష పదవి లభించింది. ఆ హోదాలో ఆమె పలు ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించారు.

సంఘ సేవాకార్యక్రమాల నిర్వహణలో అవిశ్రాంతగా శ్రమిస్తూ కూడ ఆమె ఆనాటి రాజకీయల మీద దృష్టిసారించారు. జాతీయ సేవాభావాలు గల ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపారు. జాతీయోద్యమంలో భాగంగా ఉనికిలోకి వచ్చిన పలు సంస్థల్లో కార్యక్రమాలలో ఆమె సభ్యురాలిగా పాల్గొన్నారు. ఈ మేరకు అటు సమాజ సేవా కార్యక్రమాల ద్వారా, ఇటు రాజకీయ కార్యక్రమాల వైెపు మొగ్గు చూపిన కారణంగా అటు ప్రజల ఇటు రాజకీయ ప్రముఖుల మన్నన పొందారు.

ఆ కారణంగా స్వతంత్ర భారతదేశం అవతరించాక 1952 లో తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాసుమా బేగంను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె షాలిబండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగారు. ప్రముఖ కవి, కమ్యూనిస్టు పార్టీనాయకుడు, కార్మికనేత మగూం మోహిద్దీన్‌ ఆమె ప్రత్యర్ధి. ఆయన పీపుల్స్‌ డెమాక్రటిక్ ఫ్రంట్‌ అభ్యర్థిగా పోటిచేశారు. ఆ ఎన్నికలలో ఏడు వందల 74 ఓట్ల ఆధిక్యతతో మాసుమా బేగం విజయం సాధించారు.

ఆ తరువాత 1957లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆమె పోటిచేసి గెలిచారు.ఈ సారి ఫత్తర్‌ఘట్టి అసెంబ్లీ నుండి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు అకర్‌ హుస్సేన్‌ ను 513 ఓట్ల ఆధిక్య తతో పరాజితుల్ని చేశారు. ఈ ఎన్నికల సందర్బంగా ఆమె నిర్వహించిన ప్రచారం తీరు కూడ ప్రజలను బాగా ఆకట్టుకుంది. ప్రచారంలో ప్రత్యరుల కంటే ఆమె ముందుండటం విశేషం. ప్రతిరోజు వేకువ జామున ప్రచారానికి బయలు దేరి ప్రత్యర్థులు ప్రచారానికి జనంలోకి వచ్చేలోగా ఆమె తన ప్రచారాన్ని ముగించటం విశేషం.(Secluded Scholors, Gail Minault,OUP, New Delhi, 1999, Page.272-273). ముస్లిం మహిళ అయిఉండి కూడ ప్రచార కార్యక్రమంలో ప్రత్యరుల కంటే ముందుండడం ఆమె రాజకీయదక్షతకు నిదర్శనం.

ఈ విజయాల ద్వారా ఆమెకు ఎనలేని కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిన పదవులు

267