పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

(తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర), స్త్రీ శక్తి సంఘటన, హైదారాబాద్‌, 1986, పేజి.173)

తలితండ్రులు ఉదార స్వభావులెనప్పికి సన్నిహిత బంధువరం మాత్రం సనాతన సంప్రదాయవాదాులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదామ్ములు, ఆమెతో పాటు ఉద్యామాలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ ఇబ్బందులను ఏమాత్రం ఖాతరు చేయకుండ తాము నిర్దేశించుకున్న మార్గంలో రజియా బేగం, తన సోదరి జమాలున్నీసా బాజి అన్నదమ్ములు అన్వర్‌, అఖ్తరలతో కలసి ముందుకు సాగారు. ప్రజలను చెతన్యవంతుల్ని చేయ టం ప్రదానాశయంగా సాగిన ఆమె ఆ దిశగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు.

ఆ విషయాలను రజియా బేగం వివరిస్తూ, మా కుటుంబం చాలా సంకుచిత స్వభావం కలది. ఒక్క మా తండ్రిగారే ఉదార స్వభావం కలవాడు. మేము పల్లెటూళ్ళో ఉండేది. బాజీ పెళ్ళయ్యిన (జమాలున్నీసా బాజి) తరు వాత మాకు పట్నంలో ఒక చోటంటూ దొరికింది. మేము ఉరూ, పర్షియన్‌ నేర్చుకున్నాం. ఇంగ్లీషు వచ్చేదికాదు. ఒక గోడపత్రిక ' తమీర్‌ ' అని ప్రారంభించాం. అంతా చేత్తోనే రాసేవాళ్ళం. మేం చదివి ఇతరులను కూడ చదివించేవాళ్ళం. ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను. రెండు డిక్షనరీలు ఉర్దూ-ఇంగ్లీషు-ఉర్దూ పెట్టుకుని నేర్చుకున్నాను. షేక్స్‌పియర్‌, వికర్‌ హ్యూగో చదివాను. అర్థమయినపుడు యెంతో ఆనందించాను. మెల్లిగా అనువాదాలు చేయడం ప్రారంభిం చాను. ' ఇవాన్‌ ' అనే పత్రిక చదవటం మొదాలుపెట్టాను. చిన్న చిన్న కథలు రాయటం, తర్వాత ఉస్మానియా జర్నల్‌లో ప్రచురిచటం మొదలు ప్టోను. ఒక నవల కూడ రాశాను, అని అన్నారు. (మనకు తెలియని మన చరిత్ర పేజి.173)

ఆ విధంగా స్వయం కృషితో విద్యార్జన వైపు దృష్టిసారించిన రజియా తనకు నచ్చని ఆచారాలను పద్దతులను ఎంతో ధైర్యంతో వ్యతిరేకించారు. ఆ ప్రయత్నంలో మిత్రులను సంఘిపర్చి సంఘం ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాహిత్య కార్యక్రమాల పట్ల అత్యధిక శ్రద్దాచూపారు. ఆ కార్యక్రమాలలో, యూనుస్‌ సలీమ్‌, ముస్లిమ్‌ జియా, ఇంకా చాలమంది రచయితలు నియాజ్‌, జాకిర్‌, హుస్సేన్‌, సాహిర్‌, జిగర, సిదిఖీ లాంటి కవులు వచ్చేవాళు, కొంతమంది మా ఇంట్లోనే వుండేవాళ్ళు. సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా జరిగేవి. మేమంతా మార్కిస్స్ట్‌ సాహిత్యం

255