పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

తోపాటుగా చిన్ననాటనే స్వతంత్రబావనలు అలవడ్డయి. సన్నిహిత బంధువరం మాత్రం సనాతన సంప్రదాయవాదులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదామ్ములు, ఆమెతో పాటు ఉద్యామాలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు.

రజియా బేగం 12 సంవత్సరాల వయస్సులోనే తన అక్కయ్య జమాలున్నీసా బాజి ఇతర కుటుంబ సభ్యులతో కలసి ' నిగార్‌ ' పత్రికను చదవటం ఆరంభించారు. ఆనాడు నైజాం సంస్థానంలో నిగార్‌ పత్రిక మీదా నిషేధం ఉంది. లక్నోకు చెందిన నియాజ్‌ ఫతేపూరి సంపాదకత్వంలో నిగార్‌ పత్రిక వచ్చేది. ఆ పత్రిక ఛాందాసత్వానికి, మతమౌఢ్యనికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండ స్వాతంత్య్రం, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ముందుకు తీసుక పోవడనికి కృషిచేసింది. అందువల్ల ఈ పత్రిక అత్యంత ప్రమాదకరమైనదాని నైజాం ప్రభుత్వం భావించి సంస్థానంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించింది. (హైదారాబాదు సంస్థానంలో రాజకీయ చైతన్యం, విద్యార్థి-యువజనుల పాత్ర (1938-1956), ఎస్‌.ఎం.జవాద్‌ రజ్వీ, విశాలాంధ్రా పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ, 1985, పేజి.25)

ఈ నిగార్‌ ఉర్దూ పత్రిక చదవటం వలన మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా, బ్రటీషర్ల మిత్రుడిగా మారిన నిజాం మీద జమాలున్నీసా తనదెన స్వతంత్ర అభిప్రాయా లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ, నేను ఏడో తరగతిలో వున్నప్పటి నుండి ప్రార్ధనలు చేసేదాన్ని. ఖురాన్‌ చదవటం నేర్చుకున్నాను. నమాజ్‌ చేయటం, 'రోజా' అంటే రంజాన్‌ పండగప్పుడు ఉపవాసాలు చేయటం ఇవన్నీ చేసేది. కాలేజీ కొచ్చిన తర్వాత ఇవన్నీ మానేశాను. ఈ కర్మకాండలన్నీ మానేశాను. దేవుడు, కర్మకాండలు వేర్వేరనిపించింది. ' నిగార్‌ ' ప్రభావం ఉండేది, అని అమె స్వయంగా చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాల స్థిరత్వానికి ఆమె కుటుంబ వాతావరణం కూడ బాగా తొడ్పడింది. ఆమె అన్నదమ్ములు, అక్కయ్య జమాలున్నీసా కూడ స్వతంత్ర అలోచనలు కలిగిన వ్యకులు. ప్రజల పక్షంగా పోరాటలతో పాల్గొన్న ఉద్యామకారులు. ఆనాడు నిజాం మీదా వ్యతిరేకతతోపాటుగా, మత సంబంధమై న కొన్ని ఆచార సంప్రదాయాల విషయంలో కూడ సమకాలీన సమాజానికి భిన్నంగా ప్రవర్తించటం వలన రజియా బేగం పలు ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ, మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. మతద్రోహులమని పిలిచేవాళ్ళని ఆమె చెప్పుకున్నారు. (మనకు తెలియని మన చరిత్ర


254