పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

చదవలేదు. కాని నిగార్‌లో కొన్ని వ్యాసాలు వచ్చేవి. ఉర్దూ పత్రికలు చాలా ఉండేవి. రాజకీయల సమస్యలు కూడ చాలా చర్చించేది. యుద్ధం , జర్మనీ, హిట్లర్‌, మొదలైనవి. ఉర్దూ, ఇంగ్లీషు పుస్తకాలు చాలా తెప్పించుకుని ఎన్నో నేర్చుకునే వాళ్ళం, అని రజియా వివరించారు.

చదువు మీద ఆసక్తిగల రజియా బేగం ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. ప్రదానంగా ఆంగం నేర్చుకోవానుకున్నారు. అందుకు ఓ యువకుడ్ని నియమించుకున్నారు. అయితే ఆ ఏర్పాటును సంబంధీకులు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఆమె సోదరి జమాలున్నీసా బాజి చెబుతూ, రజియాకు ఇంగ్లీషు చెప్పటానికి ఒక బ్రహ్మణ అబ్బాయి వచ్చేవాడు. మా కుటుంబం అభ్యతంతరం పెట్టింది. బంధువులంతా వెలివేశారు. చాలా కొద్దిమంది అమ్మాయిలు ఆ రోజుల్లో చదువుకునేవాళ్ళు. మా అమ్మ మమ్మలెప్పుడూ సపోర్టు చేసేది. ఒక స్నేహితురాలిలాగా, అని తల్లితండ్రుల ధోరణిని వివరించారు. ఈ విధంగా తల్లి-తండ్రి ప్రోత్సాహంలో రజియా బేగం యం.ఎ వరకు చదువుకున్నారు. ఆమె చదువు, విముక్తి పోరాటంలో భాగస్వామ్యం పెనవేసుకుని సాగాయి.

అక్క, అన్నదమ్ములతో కలసి ఆమె కూడ జాతీయోద్యంలో భాగస్వాములయ్యారు. ప్రముఖ స్వాతంత్య్రసమరయాధుడు మౌల్వీ హస్రత్‌ మోహాని రజియా బేగం కుటుంబానికి సన్నిహిత బంధాువు. ఆయన తరుచు హైదారాబాదుకు రావటమే కాకుండ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన హైదారాబాదులో చాలా కాలం ఉన్నారు. ఆయన ప్రభావం రజియా కుటుంబం మీద ఉండే ది . ఆ ప్ర భావం నుండి ర జి యాబేగం తప్పించుకోలేకపోయారు. స్వతహగాస్వేచ్ఛాయుత భావాలు గల ఆమె బ్రిటీ షు బానిసత్వం నుండి విముక్తిని కోరుకున్నారు.ఆ కృషిలో భాగంగా ఆమె స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధులను నాయకులకు అందచేయటంలో చిన్నతనం నుండే బాధ్యతలు నిర్వహించారు. ఈ దిశగా చురుకుగా పనిచేస్తూ కూడ మొదటినించి జాతీయోద్యామంలో వుండేవాళ్ళం. మేమేం చేయడంలేదని ఎప్పుడూ అన్పించేది, అని రజియా సోదరీమణులు చెప్పుకున్నారు.

ఆ క్రమంలో సాగుతున్న రజియా కుటుంబానికి కమ్యూనిజం పరిచయం కావటంతో ప్రజల పక్షాన నిలచి పోరాడే స్వభావం గల రజియా అక్కచెళ్ళల్లు కమ్యూనిస్టు పార్టీ వైపుకు మొగుచూపారు. ఆ పరిచయంమరింత ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని


256