పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

(Page. 251- 252) లో ప్రస్తావించారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న మహిళల గురించి ఆయన తన గ్రంథంలో పేర్కొన్న వివరాలు-విశేషాలను 1999లో ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ' తెలంగాణా పోరాటంలో స్త్రీల వీరోచిత పాత్ర ' అను పేరుతో తెలుగులో ప్రచురించిన చిన్న పుస్తకంలో (పేజి. 8-9) జైనాబీ విశేషాలను ఈ క్రింది విధంగా ఉటంకించారు.

జైనాబీ : రాజారం గ్రామంలో ఒక పేదాకుటుంబీకురాలు. చిన్నతనానే భర్త పోయాడు. ఒక్క కొడుకు, తమ్ముడు, తానూ కూలికిపోయి దాని మీద బ్రతికేవారు. చల్లా సీతారామిరెడ్డి - ఆదిరెడ్డి దళం ఆ దగ్గర గుట్టలనే కేంద్రంగా చేసు కుని పనిచేస్తుండేది. ఆ దళానికి ఆహారం అందించి వస్తుండేది జైనాబీ. భారత సైన్యాలు వచ్చిన తర్వాత పార్టీకి బాగా పలుకుబడిగల గ్రామాలన్నింటా పెట్టినట్టే రాజారంలోనూ ఒక మిలటరీ క్యాంపు పెట్టారు . దానికి భయ పడకుండ, అదివరకు కన్న ఎక్కువ జాగ్రతలు తీసుకుంటూ, మరింత ధైర్యంగా దళాలకు ఆహారం చేరవేసే కార్యక్రమాన్ని సాగించింది. ముగ్గురు గెరిల్లా దళసభ్యులు పొరపాటున దారి తప్పి కల్సుకోలేకపోతే, వారికి రక్షణ ఇచ్చి మెల్లగా దళకేంద్రానికి పంపివేయగలిగింది.

ఒక రోజున మిలటరీ ఆమె ఇంటిపై దాడిచేసి, ఆమెను బాది సీతారామిరెడ్డి ఎక్కడున్నాడో చెప్పు-నిన్ను వదిలేస్తాం అంటూ హింసించారు. నాకు తెలియదు అన్నదే ఆమె జవాబు. జమేదారు అమెను బూటుకాళ్ళతో తొక్కాడు. వారి హింసాకాండకు తట్టుకుని నిలచి, మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంది. పేదరికం జెనాబీకి అనుభవమే! అందుకే ఆమెకు పార్టీ అంటే అంత ప్రేమ, విశ్వాసమూ.

ఈ విధగా తెలంగాణా పోరాట మహోన్నత దినాలలో ముస్లిం స్రీలు, పురుషులు ఇతర సోదర జనసముదాయాలతో కలసి ప్రజల బాగు కోసం ఎంతి సాహసోపేత కార్యక్రమాలయినా, తమ ప్రాణాలనుసైతం లెక్క చేయ కుండ నిర్వహించేందుకు ముందుకు వచ్చి తమ భాగస్వామ్యాన్ని అందించారు. పరాయిపాలకులు బానిసబంధానాల నుండి విముక్తికోసం గాని, భూమికోసం-భూస్వాముల నుండి విముక్తి కోసంగాని ప్రజలు సాగించిన అహింసాయుత -సాయుధపోరాట కార్యక్రమాలలో ఇతర జనసముదాయాలతో కలసి ముస్లిం మహిళలు ఉద్యమించి చరిత్రను సృష్టించారు.

252