పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలంగాణ ప్రజా పోరుకు తోడ్పడిన యోధురాలు

రజియా బేగం

పరాయి పాలకుల పెత్తనం నుండిస్వదేశీయులను విముక్తిగావించేందుకు నడుంకట్టి ముందుకు నడిచిన మహిళామ తల్లులు కొందరు ఆ లక్ష్యం సాధించగానే విశ్రాతంగా కూర్చోలేదు. స్వదేశీ సంస్థానాలు ఇండియన్‌ యూనియన్‌లో కలవడానికి ఇష్టపడని దశలో ఆయా సంస్థానాధీశుల అభిమతాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మేరకు ఉద్యమించారు. అంతిటితో ఆగకుండ భూమికోసం-భుక్తికోసం-భూస్వాముల దాష్టీికాల నుండి విముక్తి కోసం సాగిన సాయుధపోరాటంలో కూడ తమదైన పాత్ర నిర్వహించారు. ఆ తరువాత ప్రజలను చైతన్యవంతుల్నిచేస్తూ, ప్రధానంగా మహిళల సమస్యల పరిష్కారం మీద దాృష్టిసారించి తామెవ్వరికీ ఏమాత్రం తీసిపోమంటూ నిరూపణకు నిఖార్సయిన నిజంగా నిలచి చరిత్ర సృషించిన మహిళా పోరాటయోధులలో రజియా బేగం ఒకరు.

1914 ప్రాంతంలో హైదారాబాదు సంస్థానంలో రజియా బేగం జన్మించారు. ఆమె తల్లి హెదారాబాదుకు చెందిన వారు కాగా తండ్రి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు. నైజాం సంస్థానంలోని పలు ప్రాంతాలలో ఆయన న్యాయాధికారిగా పనిచేశారు. తల్లి తండ్రులు ఉదార స్వభావులు కావటంలో తమ సంతానానికి తగినంత స్వేచ్ఛ కల్పించారు. ఆ విధంగా తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛ ఫలితంగా రజియా బేగంకు అన్నదమ్ముల 253