పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


సమాఖ్య నిర్ణయించబడి, ఒక నియమావళి తయారు చేశారు. రేణు చక్రవర్తి, హజ్రబేగం (హజౌరా బేగం) పాల్గొన్నారు. అఖిల భారత మహిళా కాన్పరెన్స్‌..కలకత్తా, ఢిల్లీ సమావేశాలకి వెళ్ళాను. ఇక్కడ పని చేసున్న బద్రున్నిసాను తీసుకళ్ళాను. ఆమెకు రెండేళ్ళ పాప వుండేది. ఆమె కాన్పరెన్స్‌లో పాల్గొన్నట్టు పేపర్లో వస్తే ఆమె అత్తవారి వాళ్ళు అభ్యంతరం పెట్టారు. తర్వాత ఆమె భర్త విడాకులిచ్చాడు. ఆమె చాలా భయపడిపోయి ఇక్కడేవుండేది. ఆమెనోక ముసలతనికిచ్చి పెళ్ళి చేయాలని చూశారు. ఆమెకది ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక్కడేటీచరు పనిచేస్తూ, ఎంతో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మంది స్త్రీలు కోఆపరిేవ్‌ సెంటరుకి నేర్చుకోవాటానికి వస్తారు. కాని చాలా కొద్దిమంది పని చేయడానికి వస్తారు. వాళ్ళకు పని అంతగా అవసరం లేదు. వాళ్ళవాళ్ళెవరో ఒకరు బయట పనిచేస్తుాంరు కాబ్టి. మా బంధాువోక అమ్మాయిక్లాసులు తీసుకోడనికి ప్రయత్నించింది. కాని ఎక్కువమంది రాలేదు. నాకేవిధంగాపనిసాగించాలో తెలియటం లేదు. మతోన్మాదము కూడ కొంత కారణమైయుంటుంది. ఇదివరకు పర్దాను వ్యతిరేకించడానికి ప్ర త్నించారు. ఇప్పుడట్లాకాదు. ఇదివరకు ముస్లిం స్త్రీలు ఊరేగింపుల్లో వచ్చేవారు. నేనే ఎన్నో సార్లు ఎలక్షన్‌ మీటింగులకి, కాంపేన్లకి (ప్రచారం) తీసుకెళ్ళాను. హిందూ స్త్రీలు కూడ అంతగాపట్టించుకోవటం లేదు.

ఆ ప్రతికూల వాతావరణంలో కూడ జమాలున్నీసా కమ్యూనిస్టు కార్యకర్తగా ఎంతో నిబద్దతతో కొనసాగారు. పార్టీనాయకులు ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళి బాధ్యా తలను నిర్వహించారు. తెలంగాణా ప్రాంతానికి మాత్రవు ఆమె పరిమితం కాకుండ పలు ప్రాంతాలలో పర్యించారు. ఆ సమయంలో ప్రజలు ప్రధానంగా మహిళలు వారి పట్ల ఏవిధంగా స్పందిచారో ఆమె వివరించారు. ఆమెకు తెలుగు పూర్తిగా రాదు. ఆ కారణంగా తెలుగు మాట్లాడె ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోయారు. ఆ విషయాన్ని ఆమె ఇలా చెప్పారు. తెలుగు తెలిసి ఉంటే ఇంకా పని చేయడనికి తోడ్పడేది. చాలా మంది బాగా ఉత్సాహంగా ఉండే అమ్మాయిలుండేవారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు జ్ఞాపకం రావటం లేదు. మమ్మలెక్కడకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఎక్కడికి ఎలా వెళ్ళడం అనికూడ అడక్కపోయేవాళ్ళం. ఆర్‌.వి (రావి నారాయణరెడ్డి) వెళ్ళమనేవాడు. మేం వెళ్ళిపోయేవాళం. ఒకసారి ఆర్‌.యన్‌.తో మిర్యాలగూడ వెళ్ళాం...బోన్‌గిర్‌, హుజూర్‌నగర్‌ ఎలక్షన్‌ ప్రాపగాండకు వెళ్ళాం. ఒక ముసలమ్మ నన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టింది.

246