పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

కామ్రేడ్లని ఎప్పుడూ బాగా చూసుకునేవారు ప్రజలు.

జమాలున్నీసా కుటుంబం యావత్తు అటు కమ్యూనిస్టులు కావటంగాని లేదా కమ్యూనిస్టు సానుభూతిపరుగా మెలగటం వలన, ఆ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రదర్శించిన నిబద్దత మూలంగా కమ్యూనిస్టుపార్టీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వ్యక్తులతో సత్సంబంధాలు కుదిరాయి. ఆ కారణంగా ఆమె చెల్లెలు, తమ్ముళ్లకు ఖైఫీి అజ్మీ లాంటి ప్రముఖ కవుల కుటుంబం నుండి సంబంధాలు వచ్చాయి. ఆ విషయాన్ని కూడ జమాలున్నీసా ఈ విధంగా వివరించారు.

ఖైఫి అజ్మీ నా చిన్న ఆడబిడ్డను పెళ్ళిచేసుకున్నాడు. జకియా(నా చిన్న చెల్లెలు)ను విశ్వామిత్ర ఆదిల్‌కిచ్చి పెళ్ళిచేస్తే బాగుంటుందని ఆయన ఆన్నాడు. ఆదిల్‌ పార్టీ సభ్యుడవడమే ముఖ్యకారణం. అంటే పార్టీసభ్యులంటే ఆరోజుల్లో మంచి అభిప్రాయ ముండేది. వ్యకిగత సామర్యముగాని, క్లాసు కల్చరల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ గురించిగాని ఆలోచించే వాళ్ళం కాదు. బతుల్‌ ఇంకోక ఉదాహరణ. ఆమె పార్టీసమావేశాల కొచ్చేది. పాటలు పాడేది, కవిత్వం చదివేది. ఆమె ఒక నవాబు కూతురు. పార్టీలోకి వచ్చింది. ఆమె తండ్రికి ఇంకోక స్త్రీతో సంబంధముండేది. తన తల్లి చనిపోయిందనే కసితో బతుల్‌ పార్టీలో చేరింది. అటువంటప్పుడు ఎన్నాళ్ళుంటుంది పార్టీలో ? కొంతవరకు కమిట్‌మెంట్, ఆసక్తి ఉండి రావటం వేరు -ఆమెకొక పదకొండు సంవత్సరాల కొడుకు కూడ ఉండేవాడు. ఆ దశలో పార్టీలోకి చాలా మంది స్రీలు, పురుషులు వచ్చారు. పార్టీ వాళ్ళకు సెద్ధాంతికంగా సరియైున శిక్షణ కూడ ఇవ్వలేదు. మానసికంగా బతుల్‌ షియా అవటం వల్ల బాధను ఓర్చుకోగల్గాలి అనే భావంతోనూ, తన మానపసిక సమస్యలతోనూ పార్టీలోకి వచ్చింది. వాటిని దాటలేకపోయిదామె. తర్వాత ఆమె భర్తను వొదిలేసింది. పార్టీ మళ్ళీ కలపడానికి ప్రయత్నించింది. కాని చేయలేకపోయింది. పార్టీ ఆమెను సపోర్టు చేసింది. జహీర్‌ ఇంకో ఉదాహరణ. చాలా క్లిష్ట పరిస్థితులలో ఆమె కుటుంబాన్ని వదలి, పార్టీలో కొచ్చింది. మోయిస్‌ను పెళ్ళిచేసుకుంది. ఇద్దరూ పార్టీలో చాలా ఆక్టివ్‌గా ఉండేవాళ్ళు, ఆమె చివరిదాకా. మూడేళ్ళ క్రితం ఆమె కాన్సర్‌తో చనిపోయింది. అతను మెదక్‌ పార్టీ యూనిట్‌కి సెక్రటరీ.

ఇప్పుడు పార్టీలో సరియైున ప్రోగ్రాం గాని, పనిగాని లేదు. పైగా ఆత్మవిమర్శన చేస్తూవుంటాము. నేను అమ్మాయిలనీ, అబ్బాయిలనీ పిలచి మీటింగులు పెట్టాను.

247