పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

ఇంటికి పోనివ్వలేదు. మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళుతుండేవాడు. నా భర్త అన్న, అతని భార్య చాలా సంకుచిత స్వభావం కలవారు. ఎవర్నీబయటకు వెళ్ళనిచ్చేవారు కారు. మూడు సంవత్సరాలు నేను ఒక కుటుంబ స్త్రీగానే ఉన్నాను- కుట్టుపని నేర్చుకున్నాను. ఇంట్లో కట్టేసినట్టుండేది కాని నాకున్న కొన్ని అభిప్రాయాలను మాత్రం నేను దాచలేదు . పుస్తకాలు చదివేదాన్ని కాని ఎదో సర్దుకు పోయేదాన్ని-కుటుంబ జీవితంలో. తర్వాత మేం వేరే ఇల్లు ఉస్మాన్‌పురా కట్టెల మండి దగ్గర తీసుకున్నాం. నా కొడుకప్పుడు మూడేళ్ళవాడు. సెలవుల్లో మా నాన్నదగ్గరకు వెళ్ళుతుండేదాన్ని. అది మా అత్తగారింట్లో ఇష్టం ఉండేది కాదు. అటువంటి ప్రతికూల వాతావరణంలో కూడ ఆమె తన చిన్ననాటి స్వతంత్ర భావనలను వదులుకోలేదు . ఆ తరు వాతి కాలంలో అత్తవారింటి వాతావరణంలో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పులతో తాత్కాలికంగా తెరపడిన కార్యకలాపాలను మరింత ఉత్సాహంతో జమాలున్నీసా ఆరంభించారు.

చిన్నతనంలోనే జాతీయోద్యమం పట్ల ఆకర్షితురాలైన జమాలున్నీసా స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ విషయాన్నిఆమె స్వయంగా ప్రస్తావిస్తూ, స్వదేశీ ఉద్యమం కూడ మమ్మల్ని ప్రబావితం చేసింది. నేను స్వదేశీ బట్టలనే కట్టుకునేది. (మనకు తెలియని మన చరిత్ర ó పేజి.173) అని అన్నారు. ఆ సమయంలో జమాలున్నీసా కుటుంబం మీద స్వాతంత్య్రసమరయోధుడు, ప్రసిద్ధ కవి మౌలానా హస్రత్‌ మోహని ప్రభావం ఉంది. ఆమె కుటుంబానికి ఆయన దగ్గర బందువు.హైదారాబాదు వచ్చి మల్లేపల్లి మసీదు వద్ద ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నారని, ఆయనకు తమ కుటుంబంతో సన్నిహిత బంధుత్వం సంబంధాలున్నాయని జమాలున్నీసా చెప్పుకున్నారు. మౌలానా మోహాని చాలా చురుకైన స్వదేశీ ఉద్యమకారుడు. జాతీయోద్యమంలో ఆయన బ్రిటిషరకు వ్యతిరేకంగా పోరాడుతూ పలుమార్లు జెళ్ళ పాలయ్యారు. ఆయనను సహచరులు ' ఫైర్‌ బ్రాండ్‌ ' గా పరిగణించేవారు. అటువంటి యోధునితో ఏర్పడిన పరిచయం జమాలున్నీసా కుటుంబ సభ్యులను జాతీయోద్యమం, స్వదేశీ ఉద్యమం, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యామాల దిశగా నడిపించాయి.

ఆ కారణంగా జమాలున్నీసా జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయినప్పటికి చేయాల్సినంతగా చేయలేదని ఆమె చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మొదట్నించి జాతీయోద్యమంలో వుండేవాళ్ళం. మేమేం చేయడం లేదని

239