పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఎప్పుడూ అన్పించేది. మేము అజంతాలో వున్నప్పుడు ముహమ్మద్‌ అలీ, ఆయన భార్య అక్కడికొచ్చారని తెలిసింది. మేము, అఖ్తర్‌ (సోదరుడు) మా పెద్ద నాన్న మా పాకెట్ మనీ -15, 20 రూపాయలు జమచేసి బేగం ముహమ్మద్‌ అలీకి ఇచ్చాం, అని చెప్పుకున్నారు. (మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రతాంగపోరాటంలో స్రీలు-ఒక సజీవ చరిత్ర), స్త్రీ శక్తి సంఘటన, హైదారాబాద్‌, 1986, పేజి.175).

ఆనాడు నిజాం సంస్థానంలో జాతీయోద్యమ భావాలు వ్యక్తం చేయటం కాదు కనీసం మనస్సులో ఉండటం కూడ పెద్ద అపరాధంగా భావిసున్న భయానక వాతావరణం. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండటమే చాలా పెద్ద నేరం. ఆ వాతావరణంలో జమాలున్నీసా స్వతంత్ర భావనలు కలిగి ఉండటమే కాకుండ స్వదేశీ ఉద్యమంలో ఆచరణాత్మకంగా పాల్గొనటం జాతీయోద్యామానికి ఆర్థికంగా తోడ్పటం చాలా ప్రమాదాకరమైన ప్రయత్నం అటువంటి సాహసాన్ని జమాలున్నీసా ప్రదర్శించారు. జాతీయోద్యమ నిధికి చిన్న వయస్సులోనే తన పాకెట్ మనీని అందచేసి జాతీయోద్యమంలో భాగస్వాములు కావటం విశేషం.

జాతీయోద్యమంలో పాల్గొన్న జమాలున్నీసా బాజి ఆ తరువాత సంతరించుకున్న కమ్యూనిస్టు భావాల కారణంగా క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు . ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. కాని ఆ ఉద్యమం పట్ల, ఉద్యమకారుల పట్ల సానుభూతి ఉండేదని, అమె స్వయంగా చెప్పుకున్నారు. అనాడు బాజి కుటుంబం గాంధీ కంటే సుబాష్‌ చంబ్రోసు అభిప్రాయాలతో ఏకీభవించారు. ఈ విషయాన్నికూడ అమె స్పష్టంచేస్తూ గాంధీ కంటె నెహ్రూ˙నే ఇష్టపడేవాళ్ళం. సుభాస్‌ బోస్‌ కాంగ్రెస్‌ నుంచి తీసేసినపుడు మాకు చాలా కోపం, బాధ కలిగింది అన్నారు. (మనకు తెలియని మన చరిత్ర పేజి.175).

జమాలున్నీసాకు చిన్నతనంలో సరైన పాఠశాలలో విద్య లభించలేదు. అయినా ఆ తరువాతి కాలంలో స్వయంగా శ్రమించి ఉర్దూ, ఆంగ్ల భాషలను అమె నేర్చుకున్నారు. ఆ విధంగా సంపాదించుకున్న బాషా పరిజ్ఞానంతో చెల్లెలు రజియా బేగంతో కలసి సాహిత్య సమావేశాలకు హజరయ్యారు. ఆ క్రమంలో హైదారాబాదు నగరంలోని మలక్‌పేట లోగల తమ గృహాన్ని సాహిత్యకారుల కూడలిగా మార్చారు. ఆమె ' బజ్మె ఎహబాబ్‌ '

240